Minister Talasani: ఈనెల 27న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక
ABN, First Publish Date - 2023-09-23T15:32:07+05:30
ఈనెల 27న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
హైదరాబాద్: ఈనెల 27న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల (Double Bed Room Houses) లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) తెలిపారు. శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ... ఇప్పటికే 2 విడతలలో 24,900 ఇండ్ల పంపిణీ పూర్తి అయ్యాయని.. 3,4 విడతలలో 10,500 చొప్పున 21 వేల ఇండ్ల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ నెల 27 న ర్యాండో మైజేషన్ పద్ధతిలో ఆన్లైన్ డ్రా ద్వారా 21 వేల మంది లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. అక్టోబర్ 2 వ తేదీన 10,500, అక్టోబర్ 5 వ తేదీన మరో 10,500 ఇండ్ల పంపిణీ ఉంటుందన్నారు. ఎంతో పారదర్శకంగా రాజకీయ జోక్యం లేకుండా పార్టీలకు అతీతంగా ఇండ్లను పంపిణీ చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
Updated Date - 2023-09-23T15:32:07+05:30 IST