ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Talasani: తారకరత్న పార్థివదేహానికి మంత్రి తలసాని నివాళి

ABN, First Publish Date - 2023-02-20T11:42:48+05:30

నందమూరి తారకరత్న మరణం చాలా బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) మరణం చాలా బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. సోమవారం ఫిలింఛాంబర్‌ (Filmchamber)లో తారకరత్న (Tarakaratna) భౌతికకాయానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. తారకరత్న కుటుంబసభ్యుల (Tarakaratna Family)ను పరామర్శించారు. అనంతరం తలసాని (Telangana Minister) మీడియాతో మాట్లాడుతూ.. 40 ఏళ్ల వయస్సులోనే తారకరత్న చనిపోయవడం విచారకరమని ఆవేదన చెందారు. 20 ఏళ్లలోనే పరిశ్రమలోకి అడుగుపెట్టి 24కు సినిమాల్లో నటించారని తెలిపారు. తాత (NTR) అడుగుజాడల్లో నడవాలనుకున్నారన్నారు. తారకరత్న కుటుంబానికి, నందమూరి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రార్థించారు.

కాగా.. తారకరత్న శనివారం రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి (Narayana Hrudayalaya Hospital)లో కన్నుమూశారు. టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader NaraLokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (YuvaGalama Padayatra) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనవరి 27న కుప్పం (Kuppam) వెళ్లిన ఆయన.. అక్కడ గుండెపోటు (Heart Attack)కు గురై తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. జనం మధ్యనే ఒక్కసారిగా కుప్పకూలిన తారకరత్నను పార్టీ కార్యకర్తలు వెంటనే కుప్పంలోని కేసీ ఆస్పత్రి (KC Hospita)లో ప్రాథమిక చికిత్స అనంతరం పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి గ్రీన్‌ చానల్‌ (Green Channel) ద్వారా ఆయన్ను బెంగళూరు (Banglore)లోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుకు గురైన సమయంలో తారకరత్న మెదడు (Brain Problem)కు దాదాపు 45 నిమిషాలు రక్తప్రసరణ ఆగిపోవడంతో మెదడులోని కొంతభాగం దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. అప్పటి నుంచి వైద్యులు ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. కాగా.. శివరాత్రి (MahaShivratri) రోజున తారకరత్న తుదిశ్వాస విడిచారు.

Updated Date - 2023-02-20T11:42:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising