ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Talasani: బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం..

ABN, First Publish Date - 2023-07-16T11:47:36+05:30

హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గోల్కొండలో బోనాలు ప్రారంభమయ్యాయని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గోల్కొండలో బోనాలు ప్రారంభమయ్యాయని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుతున్నాయని అన్నారు. లాల్‌దర్వాజా అమ్మవారికి మంత్రి తలసాని పట్టువస్త్రాలు సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బోనాల సందర్బంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, రాజకీయాలకు అతీతంగా బోనాల జాతర జరుగుతోందని చెప్పారు.

ఏ ప్రభుత్వాలు దేవాలయాలకు నిధులు ఇవ్వడం లేదని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం బోనాలకు ప్రత్యేక నిధులు కేటాయించిందని మంత్రి తలసాని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు. ఢిల్లీలో కూడా బోనాలు చేసి మన సంప్రదాయంను చాటి చెప్పారన్నారు. కుల మతాలకు అతీతంగా ఐక్యతతో బోనాల ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. ప్రశాంతంగా బోనాల ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నానని మంత్రి తలసాని అన్నారు.

Updated Date - 2023-07-16T11:47:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising