Minister Talasani: హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు
ABN, First Publish Date - 2023-01-20T17:33:59+05:30
డెక్కన్ కాంప్లెక్స్‌పై నిపుణుల రిపోర్ట్ వచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ (Minister Talasani Srinivasyadav) అన్నారు.
హైదరాబాద్: డెక్కన్ కాంప్లెక్స్‌పై నిపుణుల రిపోర్ట్ వచ్చాకే తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ (Minister Talasani Srinivasyadav) అన్నారు. ఇలాంటి గోదాములు గ్రేటర్ పరిధిలో 25 వేలు ఉన్నాయని అంచనాకు వచ్చామని, ఒకేసారి భవనాలపై చర్యలు తీసుకుంటే పేదలు ఉపాధి కోల్పోతారని, భవనాల కూల్చివేతపై ఉన్నతస్థాయి కమిటీ వేస్తున్నామని తలసాని చెప్పారు. ఈ నెల 25న అన్ని శాఖలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తామని మంత్రి తలసాని వెల్లడించారు. కిషన్‌రెడ్డి టూరిస్ట్‌లాగా వచ్చి గాలి మాటలు మాట్లాడారని, హైదరాబాద్ (Hyderabad) అభివృద్ధికి కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని తలసాని ఆరోపించారు.
Updated Date - 2023-01-20T17:39:06+05:30 IST