ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mynampally Hanmanthrao: మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరబోయే తేదీ ఖరారు...ఎప్పుడంటే?..

ABN, First Publish Date - 2023-09-25T13:57:18+05:30

అధికారపార్టీ బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. తాను కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు స్వయంగా మైనంపల్లి ప్రకటించారు. అలాగే ఏ రోజు కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే విషయాన్ని కూడా ఎమ్మెల్యే వెల్లడించారు.

హైదరాబాద్: అధికారపార్టీ బీఆర్‌ఎస్‌కు (BRS) గుడ్‌బై చెప్పిన మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (MLA Mynampally Hanmanth Rao) కాంగ్రెస్ పార్టీలో (Congress) చేరబోతున్నారు. తాను కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు స్వయంగా మైనంపల్లి ప్రకటించారు. అలాగే ఏ రోజు కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే విషయాన్ని కూడా ఎమ్మెల్యే వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలోకి తనను ఆహ్వానించారని... ఈనెల 27న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్ర, జాతీయ నాయకుల సమక్షంలో పార్టీలో చేరుతానని వెల్లడించారు. సర్వేల ఆధారంగా తనకు, తన కొడుక్కి టికెట్లు వస్తాయని ఆశిస్తున్నట్లు మైనంపల్లి హనుమంతరావు తెలిపారు.


ఈరోజు ఉదయం మైనంపల్లి హనుమంతరావును సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... హైకమాండ్ ఆదేశానుసారం హనుమంతరావును పార్టీలోకి ఆహ్వానించామని తెలిపారు. హన్మంతరావు, వారి కుమారుడు రోహిత్ రావు , నక్క ప్రభాకర్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని,చర్చలు ఫలించాయన్నారు. కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉన్న వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరలేదన్నారు. 27న మైనంపల్లి పార్టీలో చేరుతారని.. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలిపారు. టికెట్ల అంశం పార్టీలో సమస్య కాదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Updated Date - 2023-09-25T13:57:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising