ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MLA Raghunandana Rao : పార్టీ మార్పు ప్రచారంపై స్పందించిన దుబ్బాక ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2023-09-01T12:51:00+05:30

పార్టీ మార్పు ప్రచారంపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు స్పందించారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతోన్న మాట అవాస్తవమన్నారు. రానున్న ఎన్నికల్లో దుబ్బాక నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచి అసెంబ్లీకి వస్తానన్నారు.

హైదరాబాద్ : పార్టీ మార్పు ప్రచారంపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు స్పందించారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతోన్న మాట అవాస్తవమన్నారు. రానున్న ఎన్నికల్లో దుబ్బాక నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచి అసెంబ్లీకి వస్తానన్నారు. పార్టీ ఆదేశిస్తే.. సిద్దిపేటలో హరీష్ రావుపై పోటీ చేయటానికి సిద్ధమని రఘునందనరావు తెలిపారు. గజ్వేల్ ఈటల, సిరిసిల్లలో బండి సంజయ్, కామారెడ్డిలో ధర్మపురి అర్వింద్‌లు బీజేపీ హైకమాండ్ ఆదేశిస్తే పోటీకి సిద్ధంగా ఉన్నారన్నారు. జమిలీ ఎన్నికలతో తెలంగాణలో బీజేపీకి మేలు జరుగుతుందన్నారు. బీజేపీకి భయపడే కేసీఆర్ 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళారని రఘునందనరావు పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక మెదట నాలుగు ఎన్నికలు.. పార్లమెంట్, అసెంబ్లీకి కలిసే జరిగాయన్నారు. జమిలీ ఎన్నికలు దేశానికి అవసరమని.. వాటి కారణంగా సమయం, డబ్బు ఆదా అవుతాయని ఎమ్మెల్యే రఘునందనరావు తెలిపారు.

Updated Date - 2023-09-01T12:51:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising