Rajasingh: దమ్ముంటే గోషామహల్‌లో పోటీ చెయ్.. అసదుద్దీన్‌కు రాజాసింగ్ సవాల్
ABN, First Publish Date - 2023-09-25T15:07:49+05:30
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై (Asaduddin OYC) గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీని (RahulGandhi) హైదరాబాద్ పార్లమెంట్ నుండి పోటీ చేయాలని అసదుద్దీన్ ఓవైసీ సవాల్ చేస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తేనే తమరు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. ‘‘పాముకు పాలు పోసి పెంచినట్లు నిన్ను కాంగ్రెస్ పెంచి పోషించింది. నేను నీకు సవాల్ చేస్తున్నాను దమ్ముంటే గోషామహల్ నియోజకవర్గంకు వచ్చి పోటీ చెయ్. నువ్వు రాకపోతే నీ తమ్ముడిని కానీ... ఇంకా ఎవరినైనా గోషామహల్‌కు పోటీ చేయడానికి పంపించు. గోషామహల్ నియోజకవర్గంలో మీరు ఎవరు పోటీ చేసిన డిపాజిట్‌లు కూడా రావు. మహిళల గురించి మాట్లాడుతున్నావ్... పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశావు... మహిళలకు మి పార్టీ నుంచి ఎప్పుడైనా టికెట్ ఇచ్చావా ఓవైసీ. మీ తాత మీ ముత్తాతలు అందరూ కూడా ముస్లింలను మోసం చేశారు. అందుకే పాతబస్తీలో ముస్లింలు పేదవాళ్లుగా మారారు’’ అంటూ అసదుద్దీన్ ఓవైసీపై రాజాసింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Updated Date - 2023-09-25T15:07:49+05:30 IST