ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MLC Jeevan Reddy: హరీష్‌రావు పీవీపై ప్రేమ వలకపోస్తే.. ఆశ్చర్యంగా వుంది..

ABN, Publish Date - Dec 17 , 2023 | 01:49 PM

హైదరాబాద్: పీవీ నర్సింహారావు కాంగ్రెస్ వాదీ అని.. నిన్న (శనివారం) మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రేమ వలకపోసి మాట్లాడడం ఆశ్చర్యంగా వుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..

హైదరాబాద్: పీవీ నర్సింహారావు కాంగ్రెస్ వాదీ అని.. నిన్న (శనివారం) మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రేమ వలకపోసి మాట్లాడడం ఆశ్చర్యంగా వుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పీవీ సీఎంగా, పీఎంగా పనిచేశారని, ఆయన ఏ పదవీ చేపట్టిన ఆ పదవీకి వన్నెతెచ్చారని కొనియాడారు. పీవీ అంతిమ యాత్ర హైదరాబాద్‌లో చేపట్టాలని కుటుంబసభ్యులే కోరారని, అన్ని లాంఛనాలతో గౌరవ వందనలతో చేశారన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం బాధాకరమన్నారు.

నిన్న సభలో చర్చలు చూస్తుంటే..

ఉద్యమ పార్టీ అనిచెప్పుకునే బీఆర్ఎస్ నేతలు.. ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతున్న మౌనంగా వున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. భద్రాచలంకు చెందిన 7 మండలాలు కోల్పోయామని, స్వార్ధ పూరిత రాజకీయాల కోసం ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఈ విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. సీలేరు పవర్ ప్రాజెక్టు కోల్పోవడానికి కేసీఆరే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ ద్వారా 4వేల మెగా వాట్ల విద్యుత్ పొందే హక్కు ఉందన్నారు. కానీ 2600 మెట్ల వాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయారని ఆరోపించారు. ఐటీఐఆర్ తేవడంలో విఫలమయ్యారని, విభజన చట్టం హక్కులను సాధించడంలో ఫెయిలయ్యారన్నారు. విమర్శలు చేయడం బంద్ చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును టూరిస్ట్ స్పాట్‌గా చేసిందే బీఆర్ఎస్ అని, కాళేశ్వరం అవినీతి బయటపెడతామన్నారు. సీఎం రేవంత్ తీసుకునే నిర్ణయం శుభపరిణామమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 01:49 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising