MP Venkatesh: మోదీ తెలంగాణపై విషం చిమ్మారు
ABN, First Publish Date - 2023-07-08T17:05:46+05:30
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తెలంగాణ(Telangana)పై మరోసారి రెండు నాలుకల ధోరణి బయటపెట్టారని బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత(BRS MP Venkatesh) అన్నారు.
హైదరాబాద్(Hyderabad): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తెలంగాణ(Telangana)పై మరోసారి రెండు నాలుకల ధోరణి బయటపెట్టారని బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత(BRS MP Venkatesh) అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్(CM KCR)కు జాతీయ రాజకీయాల్లో వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. మోదీ అన్ని అబద్ధాలు, అసత్యాలే పలుకుతున్నారన్నారు.సీఎం నిరంతర కృషితో రాష్ట్రం అభివృద్ధి దిశలో వెళ్తుందన్నారు. ఆర్థికంగా, బలంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని చెప్పారు. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసారి ఆదాయం 87 శాతం ఎక్కువ. రాష్ట్ర పుట్టుకపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విషం చిమ్మారని మండిపడ్డారు. అడుగు అడుగునా రాష్ట్రంపై వివక్ష చూపుతున్నారన్నారు. ఎన్ని అవమానాలు, అవహేళన చేసినా సీఎం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.
నదీ జలాలపై వివాదాన్ని కేంద్రం ఇంకా తేల్చడం లేదన్నారు. కాళేశ్వరం(Kaleswaram)కు జాతీయ హోదా కోసం వేడుకున్నా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారం కోచ్ ఫ్యాక్టరీ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, ప్రధాన ప్రాజెక్టును గుజరాత్(Gujarat)కు తరలించారని ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ సింగరేణి(Singareni)ని ప్రైవేటీకరణ చేయమని ప్రకటించి మోసం చేశారన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ (Bayyaram Steel Factory) గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. అదానీ(Adani)కి ఎయిర్ పోర్టు(Airport)లను ప్రధాని మోడీ అక్రమంగా కట్టబెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. దేశాన్ని నియంతలా పాలించాలన్నదే మోడీ లక్ష్యమన్నారు. బీజేపీ ద్రోహులను ప్రజలు నిలదీయాలని ఎంపీ వెంకటేష్ నేత అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిధులు ఇచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వానికి నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ టి భానుప్రసాద్(Bhanuprasad) ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పుడో మంజూరైన రోడ్లకు ఈ రోజు మోదీ శంకుస్థాపన కోసం వచ్చి రాష్ట్రంలో హడావుడి చేశారని ఎద్దేవా చేాశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయని, నాటి నుంచి నేటి వరకు కోచ్ ఫ్యాక్టరీ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు ప్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి ,కుటుంబ పాలన అంటూ మోదీ అంటున్నారు, పార్లమెంట్‌లో సహచర మంత్రి అవినీతి జరగలేదని సమాధానం చెప్పడం మోదీకి తెలియదా అని నిలదీశారు.వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన బీజేపీ నేతలు ఎంతో మంది ఉన్నారన్నారు. కర్నాటకలో అవినీతి ప్రభుత్వంగా మారడంతో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. త్వరలో దేశంలో కూడా అదే జరగబోతోందని భానుప్రసాద్ తెలిపారు.
Updated Date - 2023-07-08T17:07:28+05:30 IST