Nandamuri Balakrishna : మినీ మహానాడులో బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-05-08T14:09:20+05:30
హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ మినీ మహానాడులో ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు కాకుండా ఇంకెవరకీ భారత రత్న ఇస్తారని ప్రశ్నించారు.
హైదరాబాద్ : హిందూపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ మినీ మహానాడులో ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు కాకుండా ఇంకెవరకీ భారత రత్న ఇస్తారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కు భారత తర్న ఇవ్వాలని నందమూరి కుటుంబం, టీడీపీ, అభిమానుల తరుపున బాలకృష్ణ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని ఉందన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చూపిస్తామన్నారు.
ఇంకా బాలయ్య మాట్లాడుతూ.. ‘‘సాంకేతికంగా విడిపోయినా.. ఏపీ, తెలంగాణ అనే తేడా లేకుండా అన్నదమ్ములుగా కలిసే ఉందాం. పార్టీ కార్యక్రమాల్లో నన్ను అతిథిగా సంబోధించడం అనటం భావ్యం కాదు. పార్టీ కార్యకర్తగా, ఎమ్మెల్యేగా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నాను. తెలంగాణలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తాను. ఎన్టీఆర్ పేరు చెప్పగానే ప్రతి తెలుగు గుండె పొగరుతో నినదిస్తోంది. సామాన్యుడి కోసం ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారు. పేదలకు రాజకీయాలు పరిచయం చేసిన నేత ఎన్టీఆర్. కాంక్రీట్ శ్లాబ్‌తో పక్కా ఇళ్ళను ఎన్టీఆర్ దేశానికి పరిచయం చేశారు. మహిళల కోసం పద్మావతి యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఎందరో నాయకులను ఎన్టీఆర్ రాజకీయ భిక్షను పెట్టారు. ఎన్టీఆర్ స్పూర్తితో తెలుగు యువత సేవా కార్యక్రమాలు కొనసాగించాలి’’ అని పేర్కొన్నారు.
Updated Date - 2023-05-08T14:14:29+05:30 IST