Nannuri Narsireddy: ప్రపంచ సైకోలా సంఘానికి జగన్ శాశ్వత అధ్యక్షుడు
ABN, First Publish Date - 2023-10-02T16:15:27+05:30
ప్రపంచ సైకోలా సంఘానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శాశ్వత అధ్యక్షుడని టీటీడీపీ సీనియర్ నేత నన్నూరి నర్సిరెడ్డి(Nannuri Narsireddy) సెటైర్లు వేశారు.
హైదరాబాద్, (ఎన్టీఆర్ భవన్): ప్రపంచ సైకోలా సంఘానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శాశ్వత అధ్యక్షుడని టీటీడీపీ సీనియర్ నేత నన్నూరి నర్సిరెడ్డి(Nannuri Narsireddy) సెటైర్లు వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా ఎన్టీఆర్‌భవన్‌లో సోమవారం నాడు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. .‘‘ఏపీ సీఎం జగన్ .. అంతర్జాతీయ అవినీతి సంఘానికి అధ్యక్షుడు. ఏపీలో డేటా చోరి జరిగితే.. హైదరాబాద్‌లో కేసు ఎందుకు పెట్టారో మంత్రి కేటీఆర్ చెప్పాలి? జీవనోపాధి కోసం హెరిటేజ్ పాలు చంద్రబాబు అమ్ముకుంటున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ప్రభావం ఏపీ అభివృద్ధి, యువత భవిష్యత్తు మీద పడుతోంది. చంద్రబాబు బయటకు వచ్చేవరకు అలుపెరగని పోరాటం కొనసాగిస్తాం. ఏపీలో ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోంది. 38కేసుల్లో దోషిగా ఉన్న జగన్ .. తన అవినీతి మరకలను చంద్రబాబుకు అంటించాలని చూస్తున్నాడు. జైల్లో పుట్టిన పార్టీ వైసీపీ. దేశానికి పాలన నేర్పిన నేత చంద్రబాబు. జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కేడీ జగన్ గురించి.. పైనున్న మోదీ ఆలోచించాలి’’ అని నన్నూరి నర్సిరెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-10-02T16:28:32+05:30 IST