ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirupathi: నారా లోకేష్ హైదరాబాదుకు ప్రయాణం

ABN, First Publish Date - 2023-02-19T10:05:28+05:30

తిరుపతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) హైదరాబాద్‌కు బయలుదేరి వస్తున్నారు. ఆదివారం ఉదయం శ్రీకాళహస్తి (Srikalahasti) నుంచి రేణిగుంట విమానాశ్రయంకు బయలుదేరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) హైదరాబాద్‌కు బయలుదేరి వస్తున్నారు. ఆదివారం ఉదయం శ్రీకాళహస్తి (Srikalahasti) నుంచి రేణిగుంట విమానాశ్రయంకు బయలుదేరారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు రానున్నారు. తారకరత్న (Tarakaratna)కు నివాళులర్పించనున్నారు. నటుడు తారక రత్న మృతి విషయం తెలుసుకున్న యువనేత భావోద్వేగంతో ట్వీట్ (Tweet) చేశారు. ‘‘బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు.. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగుల చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారక రత్న మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు.. నిష్కల్మషమైన నీ ప్రేమ, స్నేహ బంధం మన బంధుత్వం కంటే గొప్పది. తారకరత్నకు కన్నీటి నివాళులతో..’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. కాగా ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి తారకరత్న(40) శనివారం రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో కన్నుమూశారు.

శనివారం రాత్రి 11గంటలకు తారకరత్న పార్థివదేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్‌ నగర శివార్లలోని మోకిలలో ఉన్న ఆయన స్వగృహానికి అంబులెన్స్‌లో తీసుకువచ్చారు. సోమవారం ఫిలింనగర్‌లోని ఫిలించాంబర్‌ కార్యాలయం వద్ద ప్రజల సందర్శనార్థం ఉదయం 7నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఉంచుతారు. సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

నందమూరి తారకరత్న మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తారకరత్న మరణవార్త తీవ్ర దిగ్ర్భాంతిని, బాధను కలిగించిందని టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఆయనను బతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబసభ్యులు, అభిమానుల ప్రార్థనలు ఫలించలేదని విచారం వ్యక్తం చేశారు. 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరికి దూరమై.. తమ కుటుంబానికి విషాదం మిగిల్చారన్నారు. తారకరత్న మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. కాగా, తారకరత్న కోలుకుంటారని భావించానని, కానీ.. మృతి చెందడం బాధాకరమని జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానన్నారు.

Updated Date - 2023-02-19T10:05:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising