ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Media: బల్దియా సమావేశం.. మీడియాకు నో ఎంట్రీ.. జర్నలిస్టులపై పోలీసుల జులుం

ABN, First Publish Date - 2023-08-23T11:01:27+05:30

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశానికి మీడియాకు అనుమతి నిరాకరించారు.

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశానికి GHMC council meeting) మీడియాకు (Media) అనుమతి నిరాకరించారు. కౌన్సిల్ సమావేశంలో మీడియా ప్రతినిధులపై పోలీసుల జులుం ప్రదర్శించారు. మీడియాకు కేటాయించిన గ్యాలరీలోకి మీడియా ప్రతినిధులను పోలీసులు అనుమతించలేదు. పలువురు మీడియా ప్రతినిధులను తోసేశారు. దీంతో జర్నలిస్టులు మేయర్ ఛాంబర్ వద్ద ఆందోళన చేపట్టారు.


మరోవైపు జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశం కాసేపట్లో మొదలుకానుంది. ఎన్నికల ముందు జరగబోయే కౌన్సిల్ సమావేశం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికార విపక్ష కార్పొరేటర్లు నగర సమస్యలపై చర్చకు రెడీ అవుతున్నారు. వాడి వేడీగా కౌన్సిల్ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. గత సమావేశం అధికారుల బైకాట్‌తో అర్దంతంగా ముగిసిన విషయం తెలిసిందే. శానిటేషన్, కార్మికుల సమ్మె, బల్దియా ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వం నుంచి కరువైన సహాయం, టౌన్ ప్లానింగ్, ఎస్‌ఎన్‌డీపీ పనులపై చర్చించేందుకు కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. సభను నిర్వహించడంలో మేయర్ విజయలక్ష్మి విఫలమవుతున్నారని బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

Updated Date - 2023-08-23T11:01:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising