Congress: గ్రూప్-1 నోటిఫికేష్‌పై హైకోర్టు తీర్పుపై బల్మూరి వెంకట్ ఏమన్నారంటే...
ABN, First Publish Date - 2023-09-23T14:18:47+05:30
గ్రూప్ - 1 నోటిఫికేషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ స్పందించారు.
హైదరాబాద్: గ్రూప్ - 1 నోటిఫికేషన్‌పై హైకోర్టు (Telangana High Court) ఇచ్చిన తీర్పుపై ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ (NSUI State President Balmuri Venkat) స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్‌లో జరిగిన అవకతవకలను తప్పు పడుతూ బయోమెట్రిక్ విధానం అమలు చేయించడంలో విఫలం అయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వ తప్పిదమే అని ఆరోపించారు. ప్రతిఒక్క అభ్యర్థికి లక్ష రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగులతో ప్రభుత్వ నాయకులను జిల్లాల వారిగా అడ్డుకుంటామని హెచ్చరించారు. టీఎస్‌పీఎస్సీ ట్రాన్సపేరెన్సీగా పని చేయాలని కోరారు. యువతకు న్యాయం జరిగేలా సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మూడు అంశాలను హైకోర్టుల పరిగణలోకి తీసుకుందన్నారు. కాంగ్రెస్ వచ్చే ఎన్నికల తరువాత గెలిచి యువత సమస్యలను పరిష్కరిస్తామని బల్మూరి వెంకట్ పేర్కొన్నారు.
Updated Date - 2023-09-23T14:18:47+05:30 IST