ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News : బుద్వేల్ వేలానికి తొలగిన అడ్డంకులు.. స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు

ABN, First Publish Date - 2023-08-10T11:33:55+05:30

బుద్వేలులో భూముల వేలం ఆపాలని హైకోర్టు న్యాయవాదుల సంఘం పిల్ వేసిన విషయం తెలిసిందే. నేడు న్యాయవాదుల సంఘం లంచ్ మోషన్ మెన్షన్ చేయనుంది. ఈ రోజు నుంచి వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది.

హైదరాబాద్ : బుద్వేలులో భూముల వేలం ఆపాలని హైకోర్టు న్యాయవాదుల సంఘం పిల్ వేసిన విషయం తెలిసిందే. నేడు న్యాయవాదుల సంఘం లంచ్ మోషన్ మెన్షన్ చేయనుంది. ఈ రోజు నుంచి వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. బుద్వేలులో 100 ఎకరాలు కేటాయించాలని 2012 నుంచి కోరుతున్నామని అసోసియేషన్ తెలిపింది. హైకోర్టుకు బుద్వేల్‌లో భూకేటాయింపునకు 2012లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని వెల్లడించింది. హైకోర్టు బార్ అసోసియేషన్, రిజిస్ట్రార్ జనరల్ అనేక లేఖలు రాసినట్లు పిల్‌లో వెల్లడించింది. నేడు జరగనున్న హెచ్‌ఎండీఏ వేలం ఆపాలని హైకోర్టును అడ్వకేట్స్ అసోసియేషన్ కోరింది.

బుద్వేల్ వేలంపై హై కోర్టులో బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ మెన్షన్ చేశారు. ఈ రోజే వేలం ప్రారంభం అవుతుందని కోర్టుకు చెప్పారు. అయితే లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు నిరాకరించింది. బార్ అసోసియేషన్‌లో విభేదాలు ఉన్నాయని తెలిపింది. అందరూ ఏకాభిప్రాయంతో వస్తే వాదనలు వింటామని చెప్పింది. 11 గంటలకు వేలం ప్రక్రియ మొదలవుతుందని న్యాయవాదుల సంఘం కోర్టుకు తెలిపింది. పిటిషన్ పై స్టే ఇవ్వాలని కోరింది. అయితే అప్పటి వరకూ స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.

Updated Date - 2023-08-10T11:33:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising