ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mokila lands: రెండో రోజు మోకిలా ఫేజ్-2 భూముల వేలం ప్రారంభం.. వేలానికి మరో 60 ప్లాట్లు

ABN, First Publish Date - 2023-08-24T11:35:36+05:30

మోకిలా ఫేజ్ - 2 భూముల వేలం ప్రక్రియ రెండో రోజు ప్రారంభమైంది.

హైదరాబాద్: మోకిలా ఫేజ్ - 2 భూముల (Mokila Lands) వేలం ప్రక్రియ రెండో రోజు ప్రారంభమైంది. మరో 60 ప్లాట్లను హెచ్‌ఎండీఏ (HMDA) వేలం వేస్తోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 30 ప్లాట్లు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో 30 ప్లాట్ల వేలం జరుగనుంది. నిన్న (బుధవారం) జరిగిన వేలంలో అత్యధికంగా చదరపు గజం లక్ష రూపాయల ధర పలికిన విషయం తెలిసిందే. మోకిలాలో మొత్తం 300 ప్లాట్లను హెచ్‌ఎండీఏ వేలం వేయనుంది. ప్రతీరోజు 60 ప్లాట్ల వేలం జరుగుంది. నిన్న మొదలైన మోకిల భూముల వేలం ప్రక్రియ మరో నాలుగు రోజుల పాటు కొనసాగనుంది.


కాగా.. ఇటీవల కోకాపేట, బుద్దేల్ భూముల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వేలకోట్లు గడించింది. కోకాపేటలో (Kokapet Lands) రికార్డు స్థాయిలో భూములు ధర పలికింది. కోకాపేట్ భూములు ఆల్ ఇండియా రికార్డ్‌లను తిరగరాసింది. ఈనెల 3న కోకాపేట నియోపోలీస్ లే అవుట్ భూములకు హెచ్ఎండీఏ వేలం వేయగా.. ఎవరూ ఊహించలేనంత రేట్లను భూములు అమ్ముడుపోయాయి. నియోపోలీస్‌ లే-అవుట్‌లోని 45.33 ఎకరాల్లో ఉన్న 6,7,8,9, 10, 11, 12, 13, 14 ప్లాట్లకు హెచ్ఎండీఏ వేలం వేసింది. 6, 7, 8, 9 ప్లాట్ల వేలం ద్వారా రూ.1,532.50 కోట్ల భారీ ఆదాయం సమకూరగా.. కేవలం 10వ నెంబరు ప్లాట్‌ అత్యధికంగా రూ.100.75 కోట్ల ధర పలికింది. కోకాపేట్‌లో రెండో విడత లో భూముల ఈ- వేలం ద్వారా తెలంగాణ సర్కార్‌కు రూ. 33,19.60 కోట్లు ఆదాయం వచ్చింది.


అలాగే బుద్వేల్ భూముల (Budvel Lands) అమ్మకాల్లోనూ ప్రభుత్వానికి కాసుల పంట పడింది. బుద్వేల్ భూముల ఈ వేలంతో ప్రభుత్వానికి రూ. 3,625.73 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం 14 ప్లాట్లు...100.01 ఎకరాలను హెచ్ఎండీఏ (HMDA) విక్రయించింది. అత్యధికంగా ఎకరం భూమి ధర రూ. 41.75 కోట్లు పలికింది. యావరేజ్‌గా ఎకరా భూమి ధర రూ. 36.25 కోట్లు పలికింది. మూడు ప్లాట్లు రూ. 40 కోట్ల కంటే అధికంగా ధర పలికాయి. ఇప్పుడు తాజాగా మోకిలాలో భూములు ఎంత మేరకు ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తాయో చూడాలి.

Updated Date - 2023-08-24T13:16:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising