Parliament : మరోసారి వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చిన విపక్షాలు
ABN, First Publish Date - 2023-07-31T10:15:25+05:30
మణిపూర్ ఘటనపై చర్చ చేపట్టాలని పార్లమెంటులో విపక్షాలు మరోసారి వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చాయి. బీఆర్ఎస్ తరఫున ఏడుగురు రాజ్యసభ సభ్యులు నోటీసులు ఇచ్చారు. లోక్‌సభలోబీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం నోటీసులు దాఖలు చేశారు.
ఢిల్లీ : మణిపూర్ ఘటనపై చర్చ చేపట్టాలని పార్లమెంటులో విపక్షాలు మరోసారి వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చాయి. బీఆర్ఎస్ తరఫున ఏడుగురు రాజ్యసభ సభ్యులు నోటీసులు ఇచ్చారు. లోక్‌సభలోబీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం నోటీసులు దాఖలు చేశారు. ఉభయ సభల్లో సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని విప్ జారీ చేశారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఈరోజు సభ ముందుకు రానున్న నేపథ్యంలో తమ సభ్యులకు విపక్షాలు విప్ జారీ చేశాయి. ఈ రోజు లోక్‌సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే ఢిల్లీ ప్రభుత్వంలో పని చేసే ఉన్నతాధికారులకు బదిలీల అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతులలోకి వెళ్తాయి.
Updated Date - 2023-07-31T10:15:25+05:30 IST