Hyderabad: మంత్రిగా ప్రమాణం చేసిన పట్నం మహేందర్ రెడ్డి
ABN, First Publish Date - 2023-08-24T16:10:25+05:30
తెలంగాణ కేబినెట్ విస్తరణ గురువారం జరిగింది. రాష్ట్ర మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి (Patnam Mahender Reddy) ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్ (Raj Bhavan)లో గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) మహేందర్‌రెడ్డితో ప్రమాణస్వీకారం చేయించారు.
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణ గురువారం జరిగింది. రాష్ట్ర మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి (Patnam Mahender Reddy) ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్ (Raj Bhavan)లో గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) మహేందర్‌రెడ్డితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ (CM KCR), పలువురు మంత్రులు హజరయ్యారు. మొత్తానికి పట్నం మహేందర్‌రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారు.
ఈటల రాజేందర్ (Etala Rajendar) బర్త్‌రఫ్ తర్వాత దాదాపు రెండేళ్లపాటు సీఎం కేసీఆర్ ఆ మంత్రి పదవిని ఖాళీగా ఉంచారు. అయితే మరో మూడు నెలల్లో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కీలక నేత పట్నం మహేందర్ రెడ్డి గతంలో మంత్రిగా చేశారు. తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన గెలిచారు. తర్వాత మంత్రి పదవి వస్తుందని అంతా భావించినా.. సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదు. దీనిపై మహేందర్ రెడ్డి గతంలో రకరకాల కామెంట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో చేరుతున్నట్లు లీకులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటన చేయడం, మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మహేందర్ రెడ్డికి మంచి పట్టుంది.
Updated Date - 2023-08-24T16:17:14+05:30 IST