ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News: అత్తాపూర్ SR Digi స్కూల్‌లో దారుణం.. విద్యార్థినిపై పీఈటీ అసభ్య ప్రవర్తన

ABN, First Publish Date - 2023-08-05T14:30:46+05:30

సమాజంలో ఎక్కడ చూసినా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇటు స్కూళ్లలో కూడా విద్యార్థినిలు లైగింక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. స్కూళ్లలో విద్యార్థినిలకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లే వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి.

రంగారెడ్డి: సమాజంలో ఎక్కడ చూసినా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇటు స్కూళ్లలో కూడా విద్యార్థినిలు లైగింక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. స్కూళ్లలో విద్యార్థినిలకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లే వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి. అనేక మంది విద్యార్థినిలు తమకు ఎదురైన పరిస్థితులను తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేకపోతున్నారు. దీంతో కామాంధులు మరింత రెచ్చిపోయే పరిస్థితి ఏర్పడింది. తాజాగా రాజేంద్రనగర్‌లో జరగిన ఘటన అందరినీ కలిచివేసింది. అత్తాపూర్‌లోని ఎస్‌ఆర్ డిగీ స్కూల్‌లో ఎనిమిదవ తరగతి విద్యార్థిని లైగింక వేధింపులకు గురైంది. స్కూల్ పీఈటీ విష్ణు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, దురుసుగా వ్యవహరించాడు. విద్యార్థినికి పలుమార్లు ఫోన్లు చేసి ఇబ్బందులకు గురిచేశాడు.

రాను రాను పీఈటీ ఆగడాలు శృతిమించడంతో ఈ విషయాని విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పింది. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. స్కూల్‌లో ఉన్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. విద్యార్థిని బంధువులు కంప్యూటర్ రూమ్‌ను పగలగొట్టారు. స్కూల్‌లో ఉన్న ప్రిన్సిపాల్, ఇతర ఉపాధ్యాయులపై దాడి చేశారు. అయితే ఈ ఘటనకు బాధ్యుడైన పీఈటీ మాత్రం పత్తాలేకుండా పోయాడు. పీఈటీ ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసి పారిపోయాడు. ఈ ఘటనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఓ పక్క తరచూ చైల్డ్ అబ్యూజ్‌పై పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆ కార్యక్రమాలు జరుగుతుండగానే స్కూల్‌లో అమానుషం చోటు చేసుకుంది. స్కూల్ వద్దకు చేరుకున్న విద్యార్ధి సంఘాలు ధర్నాకు దిగారు. విద్యార్థులకు రక్షణ లేకుండా పోతోందని.. ఫీజులపై పెట్టే దృష్టి విద్యార్థుల రక్షణలో లేదు అంటూ విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-08-05T14:30:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising