PM Modi: వందేభారత్ రైలును వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ
ABN, First Publish Date - 2023-01-15T11:16:13+05:30
ఢిల్లీ (Delhi): ఈరోజు (ఆదివారం) తెలుగు రాష్ట్రాల్లో (సికింద్రాబాద్ నుంచి విశాఖ) ప్రారంభం కానున్న వందేభారత్ రైలును ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.
ఢిల్లీ (Delhi): ఈరోజు (ఆదివారం) తెలుగు రాష్ట్రాల్లో (సికింద్రాబాద్ నుంచి విశాఖ) ప్రారంభం కానున్న వందేభారత్ రైలు (Vande Bharat Train)ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఢిల్లీ (Delhi) నుంచి వర్చువల్ (Virtual)గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై (Governor Tamilisai), కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav), కిషన్‌రెడ్డి (Kishanreddy), మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani), మహమూద్ అలీ (Mahmood Ali) తదితరులు పాల్గొన్నారు. సోమవారం నుంచి పూర్తి స్థాయిలో ప్రయాణికులకు వందేభారత్ రైలు అందుబాటులోకి రానుంది. వారంలో 6 రోజులపాటు విశాఖ వందేభారత్ రైలు సేవలు అందిస్తుంది.
తెలుగు రాష్ట్రాల మధ్య అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైలుకు సంబంధించి ఛార్జీల వివరాలను అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రైల్వేశాఖ ఈ రైలు బుకింగ్స్‌ను ప్రారంభించింది. ఈనెల 16 నుంచి ప్రయాణానికి ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ ఛైర్‌కార్ పేరుతో రెండు క్లాస్‌లు ఈ రైల్లో అందుబాటులో ఉన్నాయి. విశాఖ నుంచి సికింద్రాబాద్ వచ్చే రైలుకు 20833, సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే రైలుకు 20834 నంబర్‌ను కేటాయించారు.
ఏసీ చైర్ కార్ ఛార్జీ..
సికింద్రాబాద్ నుంచి వరంగల్ రూ.520, ఖమ్మం రూ.750, విజయవాడ రూ.905, రాజమండ్రి రూ.1,365, విశాఖ రూ.1,665గా నిర్ణయించారు. అలాగే విశాఖ నుంచి రాజమండ్రి రూ.625, విజయవాడ రూ.960, ఖమ్మం రూ.1,115, వరంగల్ రూ. 1,310, సికింద్రాబాద్ రూ. 1,720గా నిర్ణయించారు.
ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఛార్జీ
సికింద్రాబాద్ నుంచి ఖమ్మం రూ. 1,460, వరంగల్ రూ. 1,005, రాజమండ్రి రూ. 2,485, విశాఖపట్నం రూ. 3,120గా నిర్ణయించారు. అలాగే విశాఖపట్నం నుంచి రాజమండ్రి రూ. 1,215, విజయవాడ, రూ. 1,825, ఖమ్మం రూ. 2,130, వరంగల్ రూ. 2,540, సికింద్రాబాద్ రూ. 3,170 గా నిర్ణయించారు.
Updated Date - 2023-01-15T11:34:43+05:30 IST