Rahul-Ponguleti-jupally: రాహుల్‌తో ముగిసిన పొంగులేటి, జూపల్లి భేటీ..
ABN, First Publish Date - 2023-06-26T16:57:01+05:30
తెలంగాణ రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల భేటీ ముగిసింది. వారివురూ ఢిల్లీలో అరగంటకుపైగా రాహుల్‌తో చర్చించారు. జులై 2న ఖమ్మం రావాలని రాహుల్‌ని పొంగులేటి ఆహ్వానించారు.
న్యూఢిల్లీ: తెలంగాణ రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul gandhi)తో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti srinivas reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (jupally krishnarao)ల భేటీ ముగిసింది. వారివురూ ఢిల్లీలో అరగంటకుపైగా రాహుల్‌తో చర్చించారు. జులై 2న ఖమ్మం రావాలని రాహుల్‌ని పొంగులేటి ఆహ్వానించారు. దీంతో ఆ రోజు ఖమ్మంలో జరిగే సభలో రాహుల్ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు.
నేతలు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఆనందంగా ఉందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కాగా ‘కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో’ నినాదంతో ముందుకు సాగాలని తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ సూచించారు. తెలంగాణ నేతలతో రాహుల్ భేటీ సందర్భంగా ఫొటో సెషన్ ఏర్పాటు చేశారు. నేతలంతా గ్రూప్ ఫొటో దిగిన అనంతరం రాహుల్‌తో కలిసి పొంగులేటి మరోసారి ఏఐసీసీ కార్యాలయంలోకి వెళ్లారు. ఈ కార్యక్రమానికి పొంగులేటి, జూపల్లి అనుచరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Updated Date - 2023-06-26T16:58:27+05:30 IST