Ponnam Prabhakar: కేటీఆర్, హరీష్‌ని కలిసి కేసీఆర్ గురించి అడిగా..
ABN, First Publish Date - 2023-12-10T12:31:21+05:30
హైదరాబాద్: తన నియోజకవర్గంలో ఓ కార్యకర్తను పరామర్శించడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఉదయం యశోద హాస్పిటల్ వెళ్లారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇక్కడే చికిత్స పొందుతున్నారని తెలిసి పరామర్శించడానికి వెళ్లారు.
హైదరాబాద్: తన నియోజకవర్గంలో ఓ కార్యకర్తను పరామర్శించడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఉదయం యశోద హాస్పిటల్ వెళ్లారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇక్కడే చికిత్స పొందుతున్నారని తెలిసి పరామర్శించడానికి వెళ్లారు. అయితే ఆ సమయంలో కేసీఆర్‌కు లోపల ట్రీట్మెంట్ అవుతుండటంతో కేటీఆర్, హరీష్ రావులను కలిసి కేసీఆర్ హెల్త్ కండిషన్ అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ యశోద ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజక వర్గానికి చెందిన కార్యకర్తను పరామర్శించేందుకు యశోద ఆస్పత్రికి వచ్చానన్నారు. అలాగే కేసీఆర్ కుటుంబ సభ్యులను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుకుసుకున్నానన్నారు. ప్రస్తుతం కేసీఆర్ హెల్త్ కండిషన్ నిలకడగా ఉందని హరీష్‌రావు, కేటీఆర్ చెప్పారని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని పొన్నం ప్రభాకర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా యశోద ఆస్పత్రికి వస్తారని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
Updated Date - 2023-12-10T12:31:23+05:30 IST