Prajabhavan: డిప్యూటీ సీఎం భట్టి అధికార నివాసంగా ప్రజాభవన్
ABN, First Publish Date - 2023-12-13T15:20:01+05:30
Telangana: డిప్యూటీ సీఎం భట్టి విక్రమర్కకు అధికారిక నివాసంగా జ్యోతి రావు పూలె ప్రజాభవన్‌ను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక మీదట భట్టి అధికారిక నివాసంగా ప్రజా భవన్ ఉండనుంది.
హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమర్కకు (Deputy CM Bhatti Vikramarka) అధికారిక నివాసంగా జ్యోతి రావు పూలె ప్రజాభవన్‌ను (Jyoti Rao Phule Praja Bhavan) ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక మీదట భట్టి అధికారిక నివాసంగా ప్రజా భవన్ ఉండనుంది. కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రగతి భవన్‌ను జ్యోతి రావు పూలె ప్రజాభవన్‌గా మారుస్తూ సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రజాభవన్ ముందు ఉన్న ఇనుప కంచెలను కూడా తొలగించి వేశారు. గతంలో ప్రగతిభవన్‌పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డిప్యూటీ సీఎం అధికార నివాసంగా ప్రజాభవన్‌ను కేటాయించిన నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం కోసం అధికార వర్గం మరో భవనాన్ని అన్వేషిస్తున్నట్లు సమాచారం.
Updated Date - 2023-12-13T15:21:08+05:30 IST