Ka Paul: మందకృష్ణ మాదిగ 72 కోట్లకు మోదీకి అమ్ముడు పోయారు
ABN, First Publish Date - 2023-11-13T17:28:26+05:30
మూడు పార్టీలకు ఓట్లు వేయకండి. 30న ఓట్లు వేయకుండా ఇంట్లో కూర్చోండి. కుటుంబ పాలన వద్దు. మాకు సింబల్ ఇవ్వనందుకు రేపు తెలంగాణ హైకోర్టుకు వెళ్తున్నాం.
హైదరాబాద్: దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ (Ka Paul) అన్నారు. పార్టీ సింబల్‌పై ఎన్నికల సంఘాన్ని కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ, మందకృష్ణ మాదిగపై ధ్వజమెత్తారు. ‘‘ఈ దేశాన్ని రక్షించాలంటే కేఏ పాల్ మాత్రమే ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతి జరుగుతున్న దేశంగా ఇండియా మారింది. మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga).. మోదీకి (Pm modi) అమ్ముడు పోయారు. పరేడ్ గ్రౌండ్‌లో సభ పెట్టడానికి మందకృష్ణ మాదిగకు రూ. 72 కోట్లు ముట్టాయి. మందకృష్ణను నా పార్టీలో చేరమంటే రూ. 25 కోట్లు అడిగారు. మోదీని ఘోరమైన తిట్లు తిట్టిన మందకృష్ణ మాదిగ.. ఇప్పుడు మోదీ దేవుడు అని అంటున్నారు. ఒక ఎంపీ సీటు ఇస్తారని మందకృష్ణ మాదిగ అమ్ముడు పోయారు. మాదిగలకు మోదీ ఇన్ని రోజులు చేయని న్యాయం ఇప్పుడు చేస్తారా?.’’ అని ప్రశ్నించారు.
‘‘మూడు పార్టీలకు ఓట్లు వేయకండి. 30న ఓట్లు వేయకుండా ఇంట్లో కూర్చోండి. కుటుంబ పాలన వద్దు. మాకు సింబల్ ఇవ్వనందుకు రేపు తెలంగాణ హైకోర్టుకు వెళ్తున్నాం. చెన్నూరు, జుక్కల్, వేములవాడ, ఉప్పల్, యాకుత్‌పురాతో పాటు 13 సెగ్మెంట్లలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు ఉన్నారు. మోదీ బీసీ కాదు.. మోదీ నా శిష్యుడు. నరేంద్ర మోదీ సర్టిఫికెట్లు అన్ని డూప్లికేట్. ప్రధానికి కేఏ. పాల్ భయపడడు. అదాని అప్పులను మోదీ కట్టకుండా మాఫీ చేశారు.’’ అని కేఏపాల్ ధ్వజమెత్తారు.
Updated Date - 2023-11-13T17:28:32+05:30 IST