KA. Paul: డీజీపీని కలిసి ఎవరిపై కేఏ.పాల్ ఫిర్యాదు చేశారంటే..!
ABN, First Publish Date - 2023-06-28T15:43:05+05:30
అధికార పార్టీ నేతలు గూండాగిరి చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ ధ్వజమెత్తారు. డీజీపీ ఆఫీస్‌లో డీజీపీ అంజనీకుమార్‌ను కేఏ.పాల్ కలిశారు. జూన్ 23న తనను చంపేందుకు కొంతమంది ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు. చంపడానికి వచ్చిన పోలీస్ అధికారులపై
హైదరాబాద్: అధికార పార్టీ నేతలు గూండాగిరి చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ (KA. Paul) ధ్వజమెత్తారు. డీజీపీ (DGP) ఆఫీస్‌లో డీజీపీ అంజనీకుమార్‌ను కేఏ.పాల్ కలిశారు. జూన్ 23న తనను చంపేందుకు కొంతమంది ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు. చంపడానికి వచ్చిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సదాశివపేట ఇన్సిపెక్టర్ నవీన్‌కుమార్, మహిళా సబ్ ఇన్సిపెక్టర్ లక్ష్మీ వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సివిల్ డ్రస్‌లో వచ్చి భయభ్రాంతులకు గురి చేశారని కేఏ.పాల్ ఆరోపించారు.
ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారని కేఏ.పాల్ చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే రాజయ్య, దుర్గం చెన్నయ్య, కౌశిక్ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తన ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించారన్నారు. చర్యలు తీసుంటామని హామీ ఇచ్చారని కేఏ.పాల్ వెల్లడించారు.
Updated Date - 2023-06-28T15:43:05+05:30 IST