ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

President Draupadi Murmu: కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది

ABN, First Publish Date - 2023-06-17T09:37:24+05:30

నగర పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పరేడ్‌లో పాల్గొన్నారు. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పెరేడ్‌కు రివ్యూయింగ్ ఆఫీసర్‌గా రాష్ట్రపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం గ్రాడ్యుయేట్స్‌ను ఉద్దేశించి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగర పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పరేడ్‌లో (Dundigal Air Force Academy Combined Graduate Parade) పాల్గొన్నారు. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పెరేడ్‌కు రివ్యూయింగ్ ఆఫీసర్‌గా రాష్ట్రపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం గ్రాడ్యుయేట్స్‌ను ఉద్దేశించి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ధైర్యవంతులు అయిన క్యాడెట్లను కన్న తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి సేవలు గుర్తుంచుకోవాలని తెలిపారు. టర్కీలో జరిగిన భూకంపంలో కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాగా పనిచేసిందని కొనియాడారు. కోవిడ్ లోనూ చాలా అద్భుతంగా పనిచేసిందన్నారు. సవాళ్ళను ఎదుర్కొనేందుకు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఏప్రిల్‌లో సుఖాయ్ జెట్‌లో ప్రయణించినట్లు తెలిపారు. ఇది తనకు చాలా గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు. ఫైటర్ జెట్ ఫైలెట్లులో మహిళలు కూడా అధికంగా ఉండటం సంతోషదాయకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.

కాగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లో పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం నగరానికి వచ్చారు. ఈ సందర్బంగా బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో సీఎం కేసీఆర్ (CM KCR), గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై (Governor Tamilisai), కేంద్రమంత్రి కిష‌న్‌రెడ్డి (Union Minister Kishan Reddy) బేగంపేట ఎయిర్‌పోర్టులో రాష్ట్రపతికి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. సీఎంతో పాటు మంత్రుల, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. రాష్ట్రపతి నేరుగా ఎయిర్‌పోర్టు నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లారు. రాత్రి ఆమె అక్కడే బస చేశారు.

Updated Date - 2023-06-17T09:37:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising