ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: బీజేపీ

ABN, Publish Date - Dec 14 , 2023 | 01:58 PM

హైదరాబాద్: కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, హామీల అమలు జరిగే వరకు ప్రజల పక్షాన నిలబడతామని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం అసెంబ్లీ సమావేశాలకు రాష్ట్ బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

హైదరాబాద్: కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, హామీల అమలు జరిగే వరకు ప్రజల పక్షాన నిలబడతామని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం అసెంబ్లీ సమావేశాలకు రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రగతి భవన్‌ను స్టడీ సర్కిల్‌గా మారుస్తామని హామీ ఇచ్చి మరిచారన్నారు. రైతు బంధులో కోత విదించడం సరైంది కాదన్నారు.

గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ మాట్లాడుతూ.. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ముందు ప్రమాణం చేయమని ముందే చెప్పామని, ఆ మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలందరూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందు ప్రమాణం చేశామన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటిలతో అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారన్నారు. ఇచ్చిన గ్యారెoటీలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అమలు చేస్తుందని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలకు నిధులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి తెస్తారా? లేక ఇటలీ నుంచి తెస్తారా...? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని.. ఆ పార్టీపై తమ యుద్ధం మొదలైందని రాజసింగ్ పేర్కొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 01:58 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising