ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Raghunandan Rao: నేనెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాను...?

ABN, First Publish Date - 2023-07-03T16:59:07+05:30

న్యూఢిల్లీ: తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మూడు పదవుల్లో ఎదో ఒక పదవి ఇవ్వాలని.. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్ లేదంటే జాతీయ అధికార ప్రతినిధి ఇవ్వాలని కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) రఘునందన్ రావు (Raghunandan Rao) డిమాండ్ చేశారు. మూడు పదవుల్లో ఎదో ఒక పదవి ఇవ్వాలని.. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్ లేదంటే జాతీయ అధికార ప్రతినిధి ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నానని, తానెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కానని అన్నారు. కొన్ని విషయాల్లో తన కులమే తనకు శాపం కావచ్చునని, రెండు నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుందన్నారు. రెండో సారి కూడా దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాకకు అమిత్ షా (Amit Shah) వచ్చి ప్రచారం చెయ్యలేదని, తనకు దుబ్బాక ఎన్నికలలో ఎవరూ సాయం చెయ్యలేదని అన్నారు. తాను పార్టీలో ఉండాలని అనుకుంటున్నానని చెప్పారు.

మునుగొడులో రూ. 100 కోట్లు పెట్టిన బీజేపీ గెలవలేదని... సొంతంగానే తాను దుబ్బాక ఎన్నికల్లో గెలిచానని రఘునందన్ రావు అన్నారు. అదే రూ. 100 కోట్లు తనకిస్తే తెలంగాణను దున్నేసేవాడినన్నారు. దుబ్బాకలో నన్ను చూసే ప్రజలు గెలిపించారు.. బీజేపీని చూసి కాదని అన్నారు. తనకంటే ముందు బీజేపీ పోటీచేస్తే 3500 ఓట్లు వచ్చాయన్నారు. బండి సంజయ్‌ (Bandi Sanjay)ది స్వయం కృతాపరాధమని, పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేసిన సంజయ్‌కు వంద కోట్లు పెట్టి యాడ్స్ ఇచ్చేంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు. పార్టీ డబ్బులో తనకూ వాటా ఉందన్నారు.

పేపర్ ప్రకటనలలో తరుణ్ చూగ్ (Tarun Choog), సునీల్ బాన్సల్‌ (Sunil Bansal) బొమ్మలు కాదు.. రఘునందన్ (Raghunandan), ఈటెల రాజేందర్ (Etela Rajender) బొమ్మలుంటే ఓట్లు వేస్తారని రఘునందన్ రావు అన్నారు. పార్టీకి శాశనసభపక్ష నేత లేడనే విషయం జేపీ నడ్డా (JP Nadda)కు తెలియదని.. ఆ విషయమై ప్రశ్నిస్తే అదేంటి అంటూ నన్నే నడ్డా అడిగారన్నారు. తాను గెలిచినందుకే ఈటెల పార్టీలోకి వచ్చారన్నారు. బండి సంజయ్ మార్పుపై మీడియా ప్రశ్నించగా.. మీడియాలో వస్తున్నవన్నీ నిజాలేనని అన్నారు. పది ఏళ్లలో పార్టీ కోసం తనకంటే ఎక్కువ ఎవరు కష్టపడలేదని రఘునందన్ రావు అన్నారు.

Updated Date - 2023-07-03T17:04:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising