ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rahul Gandhi : మేడిగడ్డకు బయలుదేరిన రాహుల్ గాంధీ

ABN, First Publish Date - 2023-11-02T07:08:03+05:30

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో మేడిగడ్డకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బయలుదేరారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన పిల్లర్లను పరిశీలించనున్నారు.

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో మేడిగడ్డకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బయలుదేరారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన పిల్లర్లను పరిశీలించనున్నారు. కాగా.. నిన్నరాహుల్‌గాంధీ కల్వకుర్తిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ హయాంలో కట్టిన ప్రాజెక్టులతో లక్షల ఎకరాలకు నీరు పారుతుంటే, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల భారీ వ్యయంతో కట్టిన ప్రాజెక్టులు ఒక్కోటి కూలిపోతున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. నాగార్జునసాగర్‌, ప్రియదర్శిని జూరాల, శ్రీరాంసాగర్‌, సింగూరు ప్రాజెక్టులను కాంగ్రెస్‌ ప్రభుత్వాలు నిర్మించాయని, ఏ సమస్యా లేకుండా అవి నేటికీ పటిష్ఠంగా ఉన్నాయని, వాటి కింద లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చి ప్రజలకు ఆదాయం, పని సమకూరుతోందని రాహుల్‌ గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో లక్షల కోట్లు అప్పుచేసి ప్రాజెక్టులు కడితే అవి చూస్తుండగానే కొట్టుకుపోతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కో బ్యారేజీ కూలిపోతోందని, సీఎం కేసీఆర్‌ వెళ్లి పరిశీలించాలని, అక్కడే సమీక్ష జరపాలని పేర్కొన్నారు.

Updated Date - 2023-11-02T07:09:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising