ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Health Bulletin: అత్యంత విషమంగానే ప్రీతి ఆరోగ్య పరిస్థితి.. హెల్త్ బులిటెన్ విడుదల

ABN, First Publish Date - 2023-02-24T11:45:34+05:30

మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని నిమ్స్ వైద్యులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మెడికో ప్రీతి (Medico Preeti) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని నిమ్స్ వైద్యులు (NIMS Doctors) తెలిపారు. శుక్రవారం ఉదయం ప్రీతి ఆరోగ్యపరిస్థితి (Preeti health condition)పై వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ (Health Bulletin)ను విడుదల చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని... వెంటీలేటర్ (Ventilator), ఎక్మో (ECMO)పై చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలిపింది. అయితే గుండె, కిడ్నీ (Heart, kidney)ల పనితీరు కొంత మెరుగుపడిందని చెప్పారు. ప్రీతి శరీరం చికిత్సకు సహకరిస్తున్నట్లు తెలిసింది. ప్రీతిని రక్షించేందుకు నిమ్స్‌ వైద్యులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

కుటుంబసభ్యుల (Preeti Family) అభ్యర్థన మేరకు గతరాత్రి నిమ్స్‌ వైద్యులు ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశారు. అందులో.. ప్రీతి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గానే ఉందని, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని చెప్పారు. అయితే ఈరోజు ఉదయం 8 గంటలకు నిమ్స్ వైద్య బృందం మరో హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశారు. నిన్నటి నుంచి ప్రీతికి ఎక్మోపైనే చికిత్స జరుగుతోందని.. ఈక్రమంలో చికిత్సకు ప్రీతి శరీరం స్పందిస్తోందని తెలిపారు. శరీరంలోని కొన్ని భాగాలు కూడా పనిచేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా నిన్నటి వరకు ప్రీతి ఊపిరిపీల్చుకోవడం కూడా చాలా కష్టంగా ఉన్నప్పటికీ.. ఈరోజు తనంతట తానే ఊపిరి పీల్చుకుంటున్నట్లు హెల్త్ బులిటెన్‌లో తెలిపారు. అయినప్పటికీ ప్రస్తుతం ప్రీతి వెంటీలేటర్, ఎక్మోపైన చికిత్స పొందుతోందని, ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. అనస్థీషియా స్పెషలిస్ట్ పద్మజ నేతృత్వంలోని కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, కొంత మంది జనరల్ ఫిజిషియన్స్... మొత్తం ఐదు మంది వైద్య బృందం ప్రీతికి చికిత్స అందిస్తోంది. డీఎంఈతో పాటు, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌‌రావు ఎప్పటికప్పుడు ప్రీతి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రీతిని ఆరోగ్యవంతురాలుగా చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు డీఎంఈ చెప్పారు.

బ్రెయిన్‌పైనే ఎక్కువ ఎఫెక్ట్...

కాగా.. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రీతి మత్తు ఇంజెక్షన్ (Anesthetic injection) తీసుకున్నారు. దీని ప్రభావం శరీరంలోని భాగాలపై విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా బ్రెయిన్‌ (Brain) మత్తు ఇంజెక్షెన్ ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రీతికి మెరుగైన వైద్యం కోసం వరంగల్ (Warangal) నుంచి హైదరాబాద్‌ (Hyderabad) నిమ్స్‌‌ ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో దాదాపు మూడు సార్లు ప్రీతి గుండె ఆగిపోయింది. వెంటనే సీపీఆర్‌ (CPR) చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా వైద్యులు చేశారు. నిమ్స్‌కు చేరుకున్న అనంతరం ప్రీతికి పూర్తిగా వెంటీలేటర్‌, ఎక్మోపైనే చికిత్స కొనసాగుతోంది.

అయితే ప్రీతి తండ్రి ఏబీఎన్‌తో మాట్లాడుతూ... ప్రీతి ఊపిరిపీల్చుకునేందుకు ఇబ్బంది పడుతోందని తెలిపారు. ప్రీతి చికిత్సకు స్పందిస్తోందని చెబుతున్నారని అయితే తాము చూసినప్పుడు ఊపిరిపీల్చుకునేందుకు ఇబ్బందిపడుతోందని చెప్పారు.

Updated Date - 2023-02-24T11:45:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising