ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Supreme Court: సుప్రీంకోర్టులో వనమా వెంకటేశ్వరావుకు ఊరట

ABN, First Publish Date - 2023-08-07T15:05:52+05:30

న్యూఢిల్లీ: వనమా వెంకటేశ్వరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యే అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం స్టే ఇచ్చింది... ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ.. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

న్యూఢిల్లీ: వనమా వెంకటేశ్వరావు (Vanama Venkateswara Rao)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో ఊరట లభించింది. ఎమ్మెల్యే అనర్హతపై హైకోర్టు (High Court) ఇచ్చిన తీర్పు (Judgment)పై ధర్మాసనం స్టే (Stay) ఇచ్చింది... ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ.. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో వనమా వెంకటేశ్వర రావు కేసు విచారణను జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant), జస్టిస్ దీపాంకర్ దత్తా (Justice Dipankar Dutta) ధర్మాసనం చేపట్టింది. తెలంగాణ హైకోర్టు (Telangana High Court) తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంను ఆశ్రయించారు. సోమవారం న్యాయస్థానం విచారణ జరిపింది.

కేసు పూర్వాపరాలు...

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వర రావు పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావుపై 4వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే ఎన్నికల అఫిడవిట్‌లో వనమా తన ఆస్తులు, కేసుల వివరాలను పొందుపర్చలేదని, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ప్రత్యర్థి జలగం వెంకటరావు హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం జులై 25న వనమాను అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. తీర్పు కాపీని జులై 26న అసెంబ్లీ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి జలగం అందజేశారు. తీర్పుపై స్టే కోరుతూ తొలుత వనమా హైకోర్టునే ఆశ్రయించారు. స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీంతో వెంకటేశ్వర రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Updated Date - 2023-08-07T15:05:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising