ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: తాండూరు గడ్డ కాంగ్రెస్‌కు అడ్డా..

ABN, First Publish Date - 2023-08-24T15:15:52+05:30

వికారాబాద్ జిల్లా: తాండూరు గడ్డ కాంగ్రెస్‌కు అడ్డా అని.. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పార్టీకి ద్రోహం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

వికారాబాద్ జిల్లా: తాండూరు గడ్డ కాంగ్రెస్‌ (Congress)కు అడ్డా అని.. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పార్టీకి ద్రోహం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు (TPCC Chief) రేవంత్ రెడ్డి (Revanth Reddy) మండిపడ్డారు. గురువారం తాండూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రేవంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఈగ వాలనివ్వనని, కార్యకర్తలపై చేయి వేస్తే ఊరుకునేది లేదని అన్నారు. తనకు కొడంగల్ (Kodangal) ఎంతో.. తాండూరు (Tandoor) కూడా అంతేనని అన్నారు. గజ్వేలు సిద్దిపేటకు మాత్రమే నీళ్లు తెచ్చుకుని.. మన ప్రాంతానికి సీఎం కేసీఆర్ (CM KCR) అన్యాయం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

కేసీఆర్ ముదిరాజ్‌లకు ఒక్క సీటైనా ఇచ్చారా?.. ముదిరాజులు ఈ రాష్ట్ర ప్రజలు కారా అని రేవంత్ ప్రశ్నించారు. ఈటలపై కోపం ఉంటే ఇంకో ముదిరాజ్ నాయకుడికి ఇవ్వాల్సిందన్నారు. బీసీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే మరో రెడ్డికి ఇచ్చారని విమర్శించారు. తొమ్మిది మంది అగ్రవర్ణాల వారు మంత్రులుగా ఉన్నా నేడు మరో పెద్ద రెడ్డికి ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. అసదుద్దీన్‌కు సీఎం కేసిఆర్ ఎం చేశారో ఏమో.... మళ్లీ కేసీఆర్‌ను గెలిపించేందుకు పనిచేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్, మోదీ, అసదుద్దీన్ అందరూ ఒక్కటేనని.. ఓటు ఎవరికేసీనా వారికేసినట్లేనని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించాలని, చేవెళ్ళ సభను విజయ వంతం చేయడానికి అందరూ కృషి చేయాలని రేవంత్ రెడ్డి పిలుపిచ్చారు.

Updated Date - 2023-08-24T15:28:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising