ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: హిమాచల్ ప్రదేశ్ సీఎంకు స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి

ABN, First Publish Date - 2023-12-07T11:23:17+05:30

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో రేవంత్ రెడ్డి సాదర స్వాగతం పలికారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో రేవంత్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. అనంతరం అక్కడినుంచి నేరుగా తాజ్ కృష్ణ హోటల్‌కు చేరుకున్నారు. అటు నుంచి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంకు చేరుకోనున్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా.. గురువారం ఎల్‌బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు.. పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాంతో రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, అధికారులు పెద్దఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని అడిషనల్‌ సీపీ వెల్లడించారు.

Updated Date - 2023-12-07T11:23:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising