ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: రాష్ట్రంలోని కౌలు రైతులకు రేవంత్‌రెడ్డి లేఖ

ABN, First Publish Date - 2023-09-13T15:28:05+05:30

రాష్ట్రంలోని కౌలు రైతులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు.

హైదరాబాద్: రాష్ట్రంలోని కౌలు రైతులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. లేఖలో ఏం తెలిపారంటే.. ‘‘రాష్ట్రంలో కౌలు రైతులకు ఎలాంటి ఆదరణ, మద్దతు దక్కడం లేదు. రైతుబంధు పథకం వర్తించక వెక్కిరిస్తున్న జీవితాలను చూస్తూ రైతులు వేదనతోనే పబ్బం గడుపుతున్నారు. రాష్ట్రంలో మీ లాంటి రైతులు 22 లక్షల మంది ఉన్నారు. 40 శాతం మేర సాగు భూమిని మీ అధీనంలోనే ఉంది. అయినా ప్రభుత్వం మీపై కనికరం చూపడం లేదు.ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో 80 శాతం మంది మీలాంటి వారే ఉండటం విషాదకరం. కౌలు రైతులను ఆదుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలికొదిలేశాయి. ప్రభుత్వ ప్రణాళిక లోపం, విధానరాహిత్యం కారణంగా తెలంగాణలో వ్యవసాయరంగం పరిస్థితి దయనీయంగా తయారైంది.కేసీఆర్‌ అనాలోచిత విధానాలతో తెలంగాణలో పంటల వైవిధ్యం దెబ్బతినడమే కాక, రైతులు ఘోరంగా నష్టపోయారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై ఇక్కడి రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే పరిస్థితులను విశ్లేషించి సాగు చేసే ప్రతి ఒక్కరికీ భరోసా కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్‌కు రూపకల్పన చేసింది.

గతేడాది మేలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) సమక్షంలో వరంగల్‌లో రైతు డిక్లరేషన్(Farmer's Declaration) ప్రకటించింది. రైతు డిక్లరేషన్ ప్రకారం ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరాకు, ఏడాదికి రూ.15 వేల పెట్టుబడి సాయం చేస్తాం. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది రూ.12 వేలు ఇస్తాం. రైతులు పండించిన అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తాం. మెరుగైన పంటల బీమా పథకాన్ని తెచ్చి... నష్ట పరిహారం అందేలా చూస్తాం. రైతుల పట్ల మాకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమే వరంగల్ డిక్లరేషన్. రైతులను గాలికొదిలేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఏవో చేస్తాయని ఆశలు పెట్టుకోవడం దండగ.ఎవరూ నిరాశకు లోనుకావద్దు. ఆ ధైర్యపడొద్దు. మీ భవిష్యత్‌కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. రాబోయే వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మీ తలరాతను మారుస్తుంది. రైతును రాజును చేసే దిశగా వరంగల్ రైతు డిక్లరేషన్ సాక్షిగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. తెలంగాణలో రైతు రాజ్యస్థాపనే కాంగ్రెస్‌ లక్ష్యం. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన ప్రతి మాటను అమలు చేసి తీరుతాం. సాగు చేసే రైతుల కష్టాలను తీరుస్తాం’’ అని రేవంత్‌రెడ్డి లేఖలో భరోసా ఇచ్చారు.

Updated Date - 2023-09-13T15:28:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising