ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TSRTC : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన మరుసటి రోజే చార్జీల బాదుడు షురూ..

ABN, First Publish Date - 2023-08-01T12:13:47+05:30

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన మరుసటి రోజే చార్జీల బాదుడును అధికారులు షురూ చేశారు. సిటీలో డే బస్ పాస్ చార్జీలను టీఎస్ఆర్టీసీ పెంచింది. 100 రూపాయలున్న డే పాస్ ను 120 కు పెంచింది. గతంలో మహిళలు, సీనియర్ సిటిజన్స్ కు 80 రూపాయలున్న డే పాస్ ఇప్పడు 100 రూపాయలుగా ఉంది. 80 , 100 రూపాయలు ఉన్నప్పుడు డే పాస్ కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది.

హైదరాబాద్ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన మరుసటి రోజే చార్జీల బాదుడును అధికారులు షురూ చేశారు. సిటీలో డే బస్ పాస్ చార్జీలను టీఎస్ఆర్టీసీ పెంచింది. 100 రూపాయలున్న డే పాస్ ను 120 కు పెంచింది. గతంలో మహిళలు, సీనియర్ సిటిజన్స్ కు 80 రూపాయలున్న డే పాస్ ఇప్పడు 100 రూపాయలుగా ఉంది. 80 , 100 రూపాయలు ఉన్నప్పుడు డే పాస్ కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. రూ.120 డే పాస్ సమయంలో రోజుకి 25 వేలు మాత్రమే అమ్మకం జరిగింది. రూ.80 రూపాయల డే పాస్ సమయంలో రోజుకీ 40 వేల వరకూ అమ్మేవారు. మళ్లీ పెరిగిన టికెట్ ధరలతో బాదుడు మొదలైందని ప్రయాణికులు చెబుతున్నారు.

కాగా.. అసెంబ్లీ ఎన్నికలు(Assembly elections) సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించింది. ఆర్టీసీ సిబ్బంది(RTC staff) దీర్ఘకాలికంగా చేస్తున్న పలు డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో పని చేస్తున్న 43,373 మంది కార్మికులు ఇక ప్రభుత్వ ఉద్యోగులు కానున్నారు. సోమవారం సీఎం కేసీఆర్‌(CM KCR) అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం(Cabinet meeting) ఇందుకు ఆమోదం తెలిపింది. ఐదు గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన క్యాబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన నష్టానికి తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేయాలని క్యాబినెట్‌ నిర్ణయించింది.

Updated Date - 2023-08-01T12:19:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising