Kishan Reddy: సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం లేదు..
ABN, First Publish Date - 2023-04-19T16:37:28+05:30
ఢిల్లీ: సింగరేణిని ప్రైవేటీకరణ చేయడంలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఇటీవల చెప్పారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు.
ఢిల్లీ: సింగరేణిని ప్రైవేటీకరణ చేయడంలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఇటీవల చెప్పారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సింగరేణి (Singareni)కి అదనపు కొల్ బ్లాక్స్ కేంద్రం కేటాయించిందన్నారు. సింగరేణి ఎన్నికలు వస్తున్నాయని, ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా దీక్షలు చేయాలని ప్రభుత్వం వారికి చెబుతోందని, సింగరేణికి నష్టం చేస్తామంటే కార్మికులు బీఎస్ఎస్ (BRS)ను క్షమించరని అన్నారు. బొగ్గు గనుల వేలంలో దేశం మొత్తం ఒకే విధానాన్ని కేంద్రం అవలంబిస్తోందన్నారు. కేంద్రం ఎక్కడ వివక్ష చూపడం లేదని.. సింగరేణి పని తీరు, అప్పులు కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి సింగరేణి బొగ్గు గని తలమానికమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ బంగారు గనిగా పిలుచుకున్న సింగరేణి పరిస్థితి ఈరోజు అగమ్యగోచరంగా తయారైందన్నారు. సింగరేణిలో అంతర్గత ప్రైవేటీకరణ, ఔట్ సోర్సింగ్ ఆర్థిక పరిస్థితి పరిపాలన, రాజకీయ జోక్యం మామూలుగా మారిపోయిందన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే సింగరేణి కార్మిక సంఘాలు గుర్తుకు వస్తాయని.. వాళ్ళ జీవితాలు, జీతాల గురించి ప్రభుత్వం మాట్లాడదని విమర్శించారు.
2014, 2019 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ (CM KCR) సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు కట్టిస్తామని చెప్పారని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సింగరేణి సంస్థను విస్తరిస్తామని చెప్పారని.. తొమ్మిది ఏళ్లు అయింది, కేసీఆర్ ఎం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోందని.. 2014లో సింగరేణిలో 60 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు పని చేస్తుంటే, ఇప్పుడు 40 వేలకు పడిపోయిందన్నారు. 20 వేల ఉద్యోగాలలో కోత విధించారన్నారు.
16 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను సింగరేణిలో నియమించి కార్మికుల శ్రమ దోపిడీకి ప్రభుత్వం పాల్పడుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ‘తెలంగాణ సాధించు సింగరేణి రక్షించు’ అనే నినాదం కేసీఆర్ ఇచ్చారని.. ఇప్పుడు సింగరేణిని భక్షించు అనే నినాదం తీసుకున్నారన్నారు. రూ. 3500 కోట్లతో సింగరేణి సంస్థ బ్యాంకు బ్యాలన్స్ ఉండేదని, ఈరోజు రూ. 10 వేల కోట్ల బకాయలలో సింగరేణి సంస్థ ఉందన్నారు. సింగరేణికి బొగ్గు కొనుగోలు దారుల నుంచి రూ. 4 వేల కోట్లు, టీఎస్ జెన్‌కో నుంచి రూ. 2 వేల కోట్లు, టీఎస్ ట్రాన్స్‌కో నుంచి రూ. 18 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 25 వేల కోట్ల బకాయిలు రావాలని.. అప్పులు తెస్తే కానీ నడవలేని పరిస్థితిలో సింగరేణి ఉందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Updated Date - 2023-04-19T16:37:28+05:30 IST