ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

OU Students: ఓయూలో విద్యార్థుల ఆందోళన.. నేటి పరీక్షలు బాయికాట్

ABN, First Publish Date - 2023-07-19T10:39:27+05:30

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు పెట్టడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో (Osmania University) విద్యార్థులు ఆందోళనకు దిగారు. సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు పెట్టడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూజీసీ రూల్స్ ప్రకారం సెమిస్టర్‌కు కనీసం 120 పని దినాల తర్వాతే పరీక్షలు పెట్టాల్సి ఉంటుంది. అయితే కనీసం రెండు నెలలు కూడా పాఠాలు చెప్పకుండానే ఓయూ అధికారులు పరీక్షలు పెడుతున్నారు. దీంతో పీజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సిలబస్ పూర్తైన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు నిరసనకు దిగారు. పరీక్షల నిర్వహణపై వీసీకి వారం రోజుల క్రితం వినతి పత్రం ఇచ్చినప్పటికీ స్పందన రాలేదు. ఈ క్రమంలో నిరసన తెలిపేందుకు వీసీ ఛాంబర్ వెళ్తున్న విద్యార్థులను హాస్టల్‌లోనే ఓయూ సెక్యూరిటీ బంధించింది. దీంతో ఈరోజు (బుధవారం) ఓయూలో జరుగుతున్న ఇంటర్నల్ పరీక్షలకు విద్యార్థులు బాయ్ కాట్ చేశారు. వర్షంలోనే విద్యార్థులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు

Updated Date - 2023-07-19T10:39:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising