Hyderabad: మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి ర్యాలీగా విద్యార్థి సంఘాలు..
ABN, First Publish Date - 2023-07-12T15:02:35+05:30
హైదరాబాద్: వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి పిలుపిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడిఎస్‌యూ విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి.
హైదరాబాద్: వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి పిలుపిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడిఎస్‌యూ విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. విద్యార్థి సంఘాలు ర్యాలీగా మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి వచ్చాయి. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు. దీంతో విద్యార్ధి సంఘం నాయకులను పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
బడ్జెట్లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల్లో జరుగుతున్న దోపిడీని అరికట్టాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు వెంటనే భర్తీ చేయాలని వామ పక్ష విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2023-07-12T15:02:35+05:30 IST