ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

HCA election: హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు

ABN, First Publish Date - 2023-10-20T19:40:31+05:30

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. హెచ్‌సీఏ నూతన అధ్యక్షుడిగా జగన్మోహనరావు విజయం సాధించారు. కేవలం ఒకే ఒక్క ఓటుతో ఆయన విజయం సాధించారు.

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. హెచ్‌సీఏ నూతన అధ్యక్షుడిగా జగన్మోహనరావు విజయం సాధించారు. కేవలం ఒకే ఒక్క ఓటుతో ఆయన విజయం సాధించారు. దీంతో ప్రత్యర్థి ప్యానల్‌కు చెందిన అమర్‌నాథ్ రీకౌంటింగ్ కోరారు. కాగా.. క్రికెట్ ఫస్ట్ ప్యానల్‌కి చెందిన సునీల్ అగర్వాల్ హెచ్‌సీఏ కౌన్సిలర్‌గా విజయం సాధించారు. ఈ ప్యానల్‌కు అర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్ మద్దతిచ్చారు. కాగా ప్యానల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్యానెల్‌కి చెందిన అన్సార్ అలీకి 47 ఓట్లు పడగా సునీల్ అగర్వాల్‌కి 59 ఓట్లుపడ్డాయి. దీంతో సునీల్ అగర్వాల్ 12 ఓట్ల తేడాతో విజయం సాధించారు.


ఇక హెచ్‌సీఏ ట్రెజరర్‌గా యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్‌కి చెందిన సీజే శ్రీనివాస రావు విజయం (జగన్మోహన్ రావు ప్యానల్) సాధించారు. సీజే శ్రీనివాస రావుకి 66 ఓట్లు పడగా.. సంజీవ్‌కి 33, మహేంద్ర‌కి 24, గెర్రాడ్‌కి 9 చొప్పున ఓట్లుపడ్డాయి. మరోవైపు.. జాయింట్ సెక్రటరీగా బసవరాజు గెలిచారు. ఈయన గుడ్ గవర్నెన్స్ ప్యానల్ నుంచి పోటీ చేసి గెలిచారు. కేవలం 2 ఓట్ల తేడాతో గెలిచారు. హెచ్‌సీఏ సెక్రటరీగా క్రికెట్ ఫస్ట్ ప్యానల్ నుంచి పోటీ చేసిన దేవరాజు గెలిచారు. దేవరాజును అభ్యర్థిగా అర్షద్ ఆయుబ్, శివలాల్ యాదవ్ బలపరిచారు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియంలో హెచ్‌సీఏ ఎన్నికల కౌటింగ్ జరిగింది. కౌన్సిలర్, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ, సెక్రటరీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యాయి.

Updated Date - 2023-10-20T19:55:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising