ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Talasani Srinivas Yadav : రేపు షెడ్యూల్ ఇచ్చి ఎన్నికలు పెట్టినా మేము సిద్ధం

ABN, First Publish Date - 2023-09-01T14:00:07+05:30

జమిలి ఎన్నికల పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తాజా సర్వేల్లో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ బీజేపీ గెలిచే అవకాశం లేదన్నారు. ఉన్నట్లుండి వేవ్ ను మార్చితే ఫలితాలు మారుతాయి అని బీజేపీ అనుకుంటోందన్నారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం జరపాలని కోరుతున్నామన్నారు.

హైదరాబాద్ : జమిలి ఎన్నికల పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తాజా సర్వేల్లో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ బీజేపీ గెలిచే అవకాశం లేదన్నారు. ఉన్నట్లుండి వేవ్ ను మార్చితే ఫలితాలు మారుతాయి అని బీజేపీ అనుకుంటోందన్నారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం జరపాలని కోరుతున్నామన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో బిల్లు పెడతారు అనే ప్రచారం ఉందని తలసాని అన్నారు. ఏ ఎన్నికలకు అయినా కేసీఆర్ సర్కార్ సిద్ధంగా ఉందన్నారు.

రేపు షెడ్యూల్ ఇచ్చి ఎన్నికలు పెట్టినా తాము సిద్ధమేనని తలసాని స్పష్టం చేశారు. వన్ ఎలక్షన్ నినాదం మోదీ ఇప్పుడు పెట్టింది కాదన్నారు. మోదీ క్రెజ్ దేశంలో పడిపోయిందన్నారు. బీజేపీ ఓడిపోతుందనే రిపోర్ట్స్ వాళ్లకు ఉందని.. కాబట్టి అసెంబ్లీ- పార్లమెంట్ కలిపి పెడితే వాళ్లకు లాభం జరుగుతుందనే ఆలోచనతో బీజేపీ ఉందన్నారు. జమిలి ఎన్నికలు అని ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికలు జరిపించారన్నారు. జమిలి ఎన్నికలు అంటే దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని తలసాని పేర్కొన్నారు.

Updated Date - 2023-09-01T14:00:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising