ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Talasani Srinivas Yadav : కంట్రోల్ రూమ్ నంబర్స్ పని చేయడం లేదని అడిగిన మీడియాపై తలసాని అసహనం

ABN, First Publish Date - 2023-07-22T13:05:16+05:30

జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నంబర్స్ పని చేయడం లేదంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మీడియా ప్రశ్నించగా.. ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశఆరు. మీడియాకు బాధ్యత ఉండాలంటూ చిర్రు బుర్రులాడారు.

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నంబర్స్ పని చేయడం లేదంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మీడియా ప్రశ్నించగా.. ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశఆరు. మీడియాకు బాధ్యత ఉండాలంటూ చిర్రు బుర్రులాడారు. భారీగా వరద నీరు చేరిన సందర్భంగా మంత్రి తలసాని, జీహెచ్ఎంసీ కమిషనర్ నేడు హుస్సేన్ సాగర్‌ను సందర్శించారు. ఏదో మొక్కుబడిగా సందర్శించి వెళ్లారనే విమర్శలు వినవస్తున్నాయి. గ్రేటర్‌లో వర్షాల మీద ప్రభుత్వం అద్భుతమైన ఫోకస్ పెట్టిందని కితాబు ఇచ్చారు.

కాగా.. హైదరాబాద్ నగర వాసుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 040- 2111 1111ను జీహెచ్ఎంసీ కేటాయించింది. కానీ వర్షాకాలం ఫిర్యాదులను బల్దియా కంట్రోల్ రూమ్ అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు వందల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయి. పదుల సార్లు కాల్స్ చేస్తే కానీ కంట్రోల్ రూమ్ లిఫ్ట్ చేయట్లేదు అంటూ నగరవాసుల మండిపడుతున్నారు. బల్దియా కంట్రోల్ రూమ్ ఇన్ ఛార్జ్ గా ఓ రిటైర్డ్ అధికారి ఉన్నారు. రోజుకు 500 నుంచి 700 వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. మాన్సూన్ సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ 24 గంటల సమయం తీసుకుంటోంది.

Updated Date - 2023-07-22T13:05:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising