ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS Assembly: ప్రతిపక్షాలకు షాకిచ్చిన తెలంగాణ ప్రభుత్వం

ABN, First Publish Date - 2023-02-04T13:02:29+05:30

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రతిపక్షాలకు ప్రభుత్వం షాకిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల (Telangana Assembly Session) నిర్వహణపై ప్రతిపక్షాలకు ప్రభుత్వం (Telangana Government) షాకిచ్చింది. 25 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలన్న ప్రతిపక్షాల అభ్యర్థనను సర్కార్ పక్కన పెట్టింది. ఈ నెల 12 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 6న బడ్జెట్‌ (Telangana Budget)ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. 7న అసెంబ్లీకి సెలవు. తిరిగి 8న బడ్జెట్‌పై సభలో సాధారణ చర్చ జరుగనుంది. 9, 10, 11 మూడు రోజుల పాటు పద్దులపై చర్చ జరుగనుంది. 12న ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది.

కాగా... అసెంబ్లీ సమావేశాలు 25 రోజుల పాటు కొనసాగించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. నిన్నటి బీఏసీ సమావేశం (BAC Meeting)లో అసెంబ్లీ సమావేశాలను 25 రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ (Congress) డిమాండ్ చేసింది. అలాగే ఎంఐఎం (MIM) సైతం సభను 20 రోజుల పాటు కొనసాగించాలని పట్టుబడింది. సమావేశాల కొనసాగింపు 8న నిర్ణయిం తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడంపై ప్రతిక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే కేవలం ఆరు రోజుల పాటు సభను నిర్వహించడంపై ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.

Updated Date - 2023-02-04T13:02:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising