Telangana Electons : తెలంగాణకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు.. 2023లోనే ఎన్నికలు?
ABN, First Publish Date - 2023-06-22T12:17:10+05:30
తెలంగాణకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు తెలంగాణకు చేరుకున్నారు. నేటి నుంచి మూడు రోజులు హైదరాబాద్‌లో మకాం వేయనున్నారు. నేడు తెలంగాణ ఎన్నికల కమిషనర్‌తో భేటీకానున్నారు. రేపు కలెక్టర్లు, ఎస్పీలతో, 24న చీఫ్ సెక్రటరీతో సమీక్ష నిర్వహించనున్నారు.
హైదరాబాద్ : తెలంగాణకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు తెలంగాణకు చేరుకున్నారు. నేటి నుంచి మూడు రోజులు హైదరాబాద్‌లో మకాం వేయనున్నారు. నేడు తెలంగాణ ఎన్నికల కమిషనర్‌తో భేటీకానున్నారు. రేపు కలెక్టర్లు, ఎస్పీలతో, 24న చీఫ్ సెక్రటరీతో సమీక్ష నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేసే చర్యలు తీసుకోనున్నారు. తెలంగాణలో 2023లోనే ఎన్నికలు జరిగేలా ఈసీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ సాధారణ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ సన్నద్దమవుతోంది. ఈ క్రమంలోనే వరుసగా అధికారులకు ట్రైనింగ్ ఇస్తూ వస్తోంది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర స్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చింది. ఈనెల 5 నుంచి 10 వరకూ ఈసీ మాస్టర్ ట్రైనర్స్‌కు శిక్షణ ఇచ్చింది. ఓటర్ల నమోదు మొదలు కొని పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకూ ఎన్నికల ప్రాసెస్‌పై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇక మూడు సంవత్సరాలు ఒకే దగ్గర పని చేస్తున్న అధికారుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడంతో ఈ బదిలీల ప్రక్రియ కూడా ప్రారంభమైంది.
తహసీల్దార్ నుంచి కలెక్టర్ల వరకు, ఎంపీడీవో నుంచి జిల్లా పంచాయతీ అధికారుల వరకు, ఎస్‌ఐల నుంచి ఎస్పీల వరకు బదిలీలుంటాయనే చర్చ సాగుతోంది. జోనల్, మల్టీ జోనల్, స్టేట్ క్యాడర్ పోస్టుల వారీగా బదిలీలు చేపట్టనున్నారు. జులై 31 లోపు ఈ బదిలీల ప్రక్రియ పూర్తి కానుంది. ఇక నవంబర్‌లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.99 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అలాగే ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. దీంతో ఓటర్ల సంఖ్య మరింత పెరగనున్నట్లు సమాచారం. కాగా.. నవంబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
Updated Date - 2023-06-22T12:17:10+05:30 IST