ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana Minister: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌పై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-03-21T14:29:38+05:30

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంతో రాష్ట్రం అట్టుడుకుతోంది. కానీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేశారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నిర్మల్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage) వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఓ వైపు ప్రతిపక్షాలు, నిరుద్యోగులు ఆందోళనలతో చేస్తుంటే.. మరోవైపు పేపర్ లీకేజీపై అధికారపార్టీ నేత, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... పేపర్ లీక్‌లు సర్వ సాధారణంగా జరిగేవే అంటూ ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసిపారేశారు. అప్పుడప్పుడు జరుగుతా ఉంటాయని కూడా చెప్పుకొచ్చారు. గతంలో టెన్త్, ఇంటర్ పేపర్లు కూడా లీకయ్యాయి అనే విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.

పేపర్ లీక్‌లో మంత్రి కేటీఆర్ (Minister KTR) దోషి అనడం సరి కాదన్నారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వాలనడంలో అర్థం లేదని తెలిపారు. రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పీఏ (KTR PA) గ్రామంలో అధిక మార్కులు వచ్చిన వారి జాబితా సమర్పించాలన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay)నోటికి అడ్డూ అదుపు లేకుండా పోయిందంటూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-03-21T15:41:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising