ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ చెప్పినట్లు అరెస్టు చేస్తే ఏజెన్సీలెందుకు?

ABN, First Publish Date - 2023-03-03T03:56:54+05:30

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు చెప్పినట్లుగా నన్ను అరెస్టు చేస్తారా..?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

దర్యాప్తు సంస్థల టార్గెట్‌గా విపక్షాలు

మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోరుతూ

ఈ నెల 10న ఢిల్లీలో నిరాహార దీక్ష

అన్ని రాష్ట్రాల నాయకురాళ్లకు పిలుపు

అదానీపై దారిమళ్లించేందుకే

గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపు

సుప్రీంకోర్టు తీర్పుతో మోదీ నుంచి

ఎన్నికల సంఘానికి విముక్తి

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌, మార్చి 2(ఆంధ్రజ్యోతి): ‘‘కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు చెప్పినట్లుగా నన్ను అరెస్టు చేస్తారా..? అలా చేస్తే ఇక దర్యాప్తు ఏజెన్సీలెందుకు? అలా చేసేవాటిని ఎవరు విశ్వసిస్తారు? ఏజెన్సీల కంటే ముందే.. బీజేపీ నాయకులు ప్రకటించడం సరికాదు. కేంద్ర దర్యాప్తు సంస్థలు విపక్ష నేతలనే టార్గెట్‌ చేశాయి. పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తే దర్యాప్తు సంస్థలతో భయపెట్టడం బీజేపీకి అలవాటుగా మారిపోయింది’’ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, భారత్‌ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతిపక్ష నేతలపై విచారణ చేయిస్తున్న బీజేపీ ప్రభుత్వం, అదానీ కుంభకోణంపై ఎందుకు విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు. గురువారం తన నివాసంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో తనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఇతర నాయకులు చేస్తున్న వ్యాఖ్యల మీద స్పందించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలన్న డిమాండ్‌తో ఈ నెల 10న ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 13 నుంచి జరిగే సమావేశాల్లోనే బిల్లు తీసుకురావాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేయన్నుట్లు చెప్పారు. ఈ దీక్షలో రాజకీయమేమీ లేదని, అన్ని పార్టీలు, సంఘాలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. సగం జనాభాను ఇంట్లో కూర్చోబెట్టి దేశాన్ని సూపర్‌ పవర్‌, విశ్వ గురువుగా ఎలా మారుస్తారని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికి వారి జనాభా ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఉప కోటా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని.. జనాభాలో సగం ఉన్న మహిళలకు రిజర్వేషన్‌ను కచ్చితంగా వర్తింపజేయాలని కవిత కోరారు. 2014లో, 2019లో మహిళా రిజర్వేషన్‌పై బీజేపీ మాట ఇచ్చి తప్పిందని విమర్శించారు. ఢిల్లీ ధర్నాకు అన్ని రాష్ట్రాల మహిళా నేతలను ఆహ్వానించామని చెప్పారు. పార్లమెంటులో మూడు రైతు వ్యతిరేక చట్టాలను ఆమోదించిన బీజేపీ సర్కారు మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో కనీసం జనగణన కూడా చేయలేదని.. దీంతోపాటు, ఓబీసీ గణన సైతం చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ సహా 21 రాష్ట్రాలు మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నాయని.. బీజేపీ పాలిత యూపీలో మాత్రం 33 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నారని కవిత విమర్శించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతుగా నిలుస్తామని సీఎం కేసీఆర్‌ గతంలోనే ప్రకటించారని గుర్తు చేశారు.

ఎన్నికల సంఘంపై సుప్రీం తీర్పు హర్షణీయం

అదానీ కుంభకోణం అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్లఽ ధరలను పెంచిందని కవిత ఆరోపించారు. సుప్రీం కోర్టు ఆదేశాలతోనే అదానీపై విచారణ మొదలైందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం విషయంలో సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. మహిళా రక్షణపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నడూ రాజీపడదని.. వైద్య విద్యార్థిని ప్రీతి ఘటన నేపథ్యంలో నాలుగు రోజుల్లోనే నిందితుడిని అరెస్టు చేసినట్లు కవిత వెల్లడించారు.

Updated Date - 2023-03-03T03:56:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!