ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Congress: ‘సమావేశంలో చర్చించిన అంశాలు ఇవే’

ABN, First Publish Date - 2023-06-10T17:41:18+05:30

బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చెయ్యాలని సమావేశంలో చర్చించామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చెయ్యాలని సమావేశంలో చర్చించామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు. మండల కమిటీలను ఈనెలాఖరు వరకు ఫైనల్ చెయ్యాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పామన్నారు. డిజిటల్ మెంబర్ షిప్ వాడుకోవాలని సూచించారు. రాచరిక పాలన, అవినీతి, కుటుంబ పాలన ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పామన్నారు. మొన్నటి వరకు ఏఐసీసీ సెక్రెటరీగా ఉన్న బోసురాజు కర్ణాటకలో మంత్రి అయ్యారని గుర్తుచేశారు. నదీమ్ జావేద్ కూడా బదిలీ అయ్యారని, వారికీ అభినందనలు తెలిపే తీర్మానం చేశామన్నారు. విష్ణు నాథన్ కొత్తగా ఏఐసీసీ సెక్రెటరీగా వచ్చారని, కర్ణాటక యువ నాయకుడు మన్సూర్ అలీ కూడా సెక్రెటరీగా వస్తున్నారని తెలిపారు. భట్టి పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారని, నల్గొండలో భట్టి యాత్ర సాగుతోందన్నారు. కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్‌లు తెలంగాణ సంపాదను లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక తరహాలో తెలంగాణాలో అధికారం వచ్చేలా పనిచేయాలని చెప్పడం జరిగిందన్నారు.

Updated Date - 2023-06-10T17:41:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising