ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: బీజేపీ పార్టీకి కొత్త అర్థం చెప్పిన రేవంత్‌రెడ్డి

ABN, First Publish Date - 2023-03-26T17:57:00+05:30

బీజేపీ (BJP) అంటే బ్రిటీష్ జనతా పార్టీని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. నాడు బ్రిటీష్ విభజించు... పాలించు విధానాన్ని బీజేపీ అమలు చేస్తుందన్నారు.

హైదరాబాద్: బీజేపీ (BJP) అంటే బ్రిటీష్ జనతా పార్టీని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. నాడు బ్రిటీష్ విభజించు... పాలించు విధానాన్ని బీజేపీ అమలు చేస్తుందన్నారు. మతాలు, ప్రాంతాలు, కులాలు, భాషల మధ్య బీజేపీ చిచ్చుపెడుతుందని ఆయన ఆరోపించారు. రాహుల్‌ గాంధీ (Rahul Gandi) పై అనర్హత వేటుకు నిరసనగా ఆదివారం కాంగ్రెస్‌(Congress) పార్టీ చేపట్టిన ‘సంకల్ప్‌ సత్యాగ్రహ’లో రేవంత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వ్యాపార ముసుగులో బ్రిటీషర్స్ దేశంలో అడుగుపెట్టింది గుజరాత్‌లోని సూరత్‌లోనే అన్నారు. బ్రిటీష్ దొరలను దేశం నుండి తరిమికొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. గాంధీ, నెహ్రు, పటేల్ దేశ నిర్మాణానికి పునాదులు వేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పునాదులతోనే ఈనదియా ప్రపంచంలోనే గుర్తింపు పొందిందనన్నారు. సర్దార్ పటేల్‌కు బీజేపీకి ఏమిటి సంబంధమో అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్.ఎస్.ఎస్‌ను నిషేధించింది సర్దార్ పటేల్ అన్నారు. గాంధీ భవన్ నిర్మాణానికి పునాదులు వేసింది సర్దార్ పటేల్ అని గుర్తుచేశారు. నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటీషర్స్ సహజ వనరులను కొల్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు బ్రిటిష్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సూరత్ నుండి అదానీ కంపెనీ బయలుదేరిందన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, దేశ సహజ వనరులను బ్రిటీష్ జనతా పార్టీ అదానీకి కట్టబెడుతుందని ఆయన ఆరోపించారు.

Updated Date - 2023-03-26T17:57:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising