Congress: రాహుల్ సస్పెండే దానికి ఉదాహరణ: జగ్గారెడ్డి
ABN, First Publish Date - 2023-03-26T19:33:29+05:30
ప్రధాని మోదీ (PM Modi)కి గాంధీ కుటుంబంపై ఎంత కక్ష పెంచుకున్నారో చెప్పడానికి రాహుల్ గాంధీ (Rahul Gandhi) సస్పెండ్ ఉదాహరణ అని కాంగ్రెస్ (Congress) సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (MLA Jaggareddy) అన్నారు.
హైదరాబాద్: ప్రధాని మోదీ (PM Modi)కి గాంధీ కుటుంబంపై ఎంత కక్ష పెంచుకున్నారో చెప్పడానికి రాహుల్ గాంధీ (Rahul Gandhi) సస్పెండ్ ఉదాహరణ అని కాంగ్రెస్ (Congress) సీనియర్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (MLA Jaggareddy) అన్నారు. పార్లమెంట్‌లో రాహుల్ ఉండోద్దనే కుట్రతోనే అనర్హత వేటు వేశారని మండిపడ్డారు. కోర్టు తీర్పును అడ్డుపెట్టుకుని గంటల వ్యవధిలో పార్లమెంట్‌లో రాహుల్ ఉండకుండా కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. ఇంతకంటే నీచం మరొకటి లేదన్నారు. రాహుల్ గాంధీకి ఎంపి పదవి లేకపోయినా పెద్ద సమస్య కాదన్నారు. పదవి ఉన్నా, లేకున్నా ఆయన మాటకు, ఆ కుటుంబానికి విలువ ఉందన్నారు. అద్వానీ ప్రధాని కాకుండా కుట్రలతో మోదీ ప్రధాని అయ్యారని ఆరోపించారు. అలాంటి మోదీకి, రాహుల్ కుటుంబానికి చాలా తేడా ఉందన్నారు. ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా వదిలేసి మన్మోహన్ సింగ్‌ను ప్రధాని చేసిన కుటుంబం రాహుల్‌దన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర చూసి బీజేపీ మైండ్ బ్లాక్ అయిందని విమర్శించారు. గాంధీని చంపిన గాడ్సేను పోగిడినప్పుడే విలువ పోయిందన్నారు. కేంద్రంలోని బీజేపీది క్రిమినల్ ప్రభుత్వమని విమర్శించారు. రాహుల్‌ను ఎందుకు సస్పెండ్ చేశామా? అని బీజేపీ ఇప్పుడు ఫీల్ అయ్యే ఉంటుందన్నారు. ఆదాని స్కాంతో బీజేపీలో కొట్లాటలు జరుగుతున్నాయని, దాని మీద చర్చ జరగకుండా బీజేపీ చేసిన రాజకీయ కుట్రనే రాహుల్‌పై చర్య అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-03-26T19:33:31+05:30 IST