BJP: వ్యవసాయశాఖ మంత్రిపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-04-18T16:01:21+05:30
ఒక సెంటు భూమి కూడా కబ్జా చేయలేదని వెంకటేశ్వరస్వామి గుడిలో వ్యవసాయశాఖ మంత్రి ప్రమాణం చేయాలని బీజేపీ (BJP) ఎమ్మెల్యే రఘునందనరావు (MLA Raghunandan Rao) డిమాండ్ చేశారు.
హైదరాబాద్: ఒక సెంటు భూమి కూడా కబ్జా చేయలేదని వెంకటేశ్వరస్వామి గుడిలో వ్యవసాయశాఖ మంత్రి ప్రమాణం చేయాలని బీజేపీ (BJP) ఎమ్మెల్యే రఘునందనరావు (MLA Raghunandan Rao) డిమాండ్ చేశారు. ఈటలను బర్తరఫ్ చేసినట్లు.. వ్యవసాయశాఖ మంత్రిని సస్పెండ్ చేయాలన్నారు. కేసీఆర్ (KCR) క్యాబినెట్లో బీసీ, దళిత నేతలకు ఒక న్యాయం.. అగ్రవర్ణాలకు మరొక న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు. ఎస్టీ నిధులతో వ్యవసాయశాఖ మంత్రి ఫాంహౌస్‌కు రోడ్డు నిర్మించారని ఆరోపించారు. తాండాల్లో రోడ్ల అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన ఎస్టీ నిధులను మంత్రి ఫాంహౌస్ కోసం వినియోగించటం దుర్మార్గమని మండిపడ్డారు. ఎకరం కొని పక్కన మరొక ఎకరాన్ని వ్యవసాయశాఖ మంత్రి కబ్జా చేశారని ఆరోపించారు. తల్లిదండ్రుల నుంచి తనకు 16ఎకరాలు సక్రమించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తన ఎన్నికల అఫడవిట్లో పేర్కొన్నారని గుర్తుచేశారు. ఇనాం భూములు, ప్రభుత్వ భూముల్లో వ్యవసాయశాఖ మంత్రి రెండు ఫాంహౌస్‌లు కట్టారని అన్నారు. తనయుడైనా.. తనయ అయినా శిక్ష తప్పదని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు ఎటు పోయాయి? అని ప్రశ్నించారు.
Updated Date - 2023-04-18T16:01:21+05:30 IST