ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS RTC: కండక్టర్ కుటుంబానికి టీఎస్‌ఆర్టీసీ భ‌రోసా

ABN, First Publish Date - 2023-06-13T18:44:20+05:30

రోడ్డు ప్రమాదంలో విషాదం అలుముకున్న కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) అండ‌గా నిలిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాధిత కుటుంబానికి టీఎస్‌ఆర్టీసీ భ‌రోసా

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కండక్టర్ కుటుంబానికి రూ.50 లక్షల అంద‌జేత‌

అక్కరకొచ్చిన యూబీఐ సూప‌ర్ సాల‌రీ సేవింగ్ అకౌంట్, రూపే కార్డు బీమా

ఉద్యోగులకు అండగా ఉంటామ‌న్న సంస్థ ఎండీ వీసీ స‌జ్జనర్

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో విషాదం అలుముకున్న కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) అండ‌గా నిలిచింది. విధి వంచించి అకాల మృత్యువు వెంటాడిన కండక్టర్‌ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించి భరోసా కల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్‌ బొల్లం సత్తయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జ‌గిత్యాల నుంచి వ‌రంగ‌ల్ వెళ్తున్న టీఎస్‌ఆర్టీసీ బ‌స్సును రాంగ్ రూట్‌లో వ‌చ్చిన లారీ ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మ‌ల్యాల-బ‌ల‌వంతాపూర్ స్టేజీ వ‌ద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇంటికి పెద్ద దిక్కు మృతి చెందడంతో బాధిత కండక్టర్ కుటుంబంలో విషాదం అలుముకుంది.

ఈ ఆప‌ద స‌మ‌యంలో యూబీఐ సూప‌ర్ శాల‌రీ సేవింగ్ అకౌంట్, రూపే కార్డు బాధిత కుటుంబానికి అక్కరకొచ్చింది. సిబ్బంది, ఉద్యోగుల సాల‌రీ అకౌంట్స్‌ను ఇటీవ‌ల యూబీఐకి టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం మార్చింది. ఆర్థిక ప్రయోజ‌నంతో కూడిన సూప‌ర్ సాల‌రీ సేవింగ్ అకౌంట్‌, రూపే కార్డు తీసుకోవాల‌ని ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. సంస్థలోని ఉద్యోగులంద‌రూ వారు నివ‌సిస్తున్న ప్రాంతాల్లోని యూబీఐ బ్రాంచీల్లో సంస్థ సూచించిన ఖాతాను తెరిచి రూపే కార్డులను తీసుకున్నారు. ఈ ఖాతా, కార్డు ద్వారా ఉచిత ప్రమాద బీమా సౌక‌ర్యం ఉండ‌టంతో ఉద్యోగుల‌కు ఎంతో ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది. ప్రమాదాలు జ‌రిగిన స‌మ‌యంలో సూప‌ర్ సాల‌రీ సేవింగ్ అకౌంట్ కింద (ఉద్యోగి వేత‌నం ప్రకారం) క‌నీసం రూ.40 లక్షలు, రూపే కార్డు కింద మ‌రో రూ.10 లక్షలను యూబీఐ అందజేస్తోంది.

ఈ మేర‌కు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జ‌గిత్యాల డిపో కండక్టర్ బొల్లం స‌త్తయ్య కుటుంబానికి రూ.50 లక్షల విలువైన 2 చెక్కుల‌ను యూబీఐ అధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ మంగ‌ళ‌వారం బ‌స్‌భ‌వ‌న్‌లో అంద‌జేశారు. రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించడంపై కండక్టర్ సత్తయ్య భార్య బొల్లం పుష్పతో పాటు కొడుకు ప్రవీణ్ కుమార్‌, కూతురు మాధ‌వీల‌త‌ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

చెక్కులను అంద‌జేసిన అనంత‌రం సజ్జనర్‌ మాట్లాడుతూ.. త‌న త‌ప్పు ఏమీ లేక‌పోయినా రోడ్డు ప్రమాదంలో సత్తయ్య అకాల మ‌ర‌ణం చెంద‌టం దుర‌దృష్టకరమన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ అధిక‌ ప్రాధాన్యతఇస్తున్నట్లు గుర్తు చేశారు. పోష‌ణ‌లో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబ స‌భ్యుల‌కు సంస్థ అండ‌గా నిలుస్తుంద‌ని, ఆత్మ స్థైర్యం, ధైర్యం కోల్పోకుండా ఉండేందుకు బాధిత కుటుంబానికి ఉచిత ప్రమాద బీమా సౌక‌ర్యం ఎంతో ఉప‌క‌రిస్తుంద‌న్నారు.

ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ఆర్థిక ప్రయోజ‌నాల‌తో కూడిన సూప‌ర్ సాల‌రీ సేవింగ్ అకౌంట్‌గా ఉద్యోగుల ఖాతాల‌ను యాజమాన్యం మార్చడం జ‌రిగిందని చెప్పారు. సంస్థలోని ప్రతి ఉద్యోగి సూపర్‌ సాలరీ సేవింగ్‌ అకౌంట్‌కు ఖాతాను మార్చుకోవాలని సూచించారు. కొన్ని ప‌థ‌కాలు ఆప‌ద స‌మ‌యంలో అక్కరకు వ‌స్తాయ‌ని, ఇందుకు ఇదే ఉదాహ‌ర‌ణ అని, వాటిని వినియోగించుకోవ‌డంలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అల‌స‌త్వం వ‌హించ‌కూడ‌ద‌ని సూచించారు. ఈ అవ‌కాశాన్ని క‌ల్పించిన యూబీఐకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2023-06-13T18:44:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising